Telangana Ration Card Name Addition : ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, సబ్సిడీ రేషన్ అందుకోవాలన్నా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డే ప్రామాణికం. అయితే వివాహమైన తర్వాత భార్య పేరును లేదా కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చడం చాలా మందికి అవసరం అవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభం. సరైన పత్రాలు ఉంటే మీసేవ కేంద్రం ద్వారా లేదా ఆన్‌లైన్ విధానంలో సులభంగా పేర్లను చేర్చుకోవచ్చు.
అవసరమైన ముఖ్యమైన ధ్రువీకరణ పత్రాలు…

రేషన్ కార్డులో కొత్తగా పేర్లను చేర్చడానికి పౌర సరఫరాల శాఖ కొన్ని ముఖ్యమైన పత్రాలను నిర్దేశించింది. భార్య పేరు చేర్చాలనుకుంటే…. భార్యకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు అధికారికంగా జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొత్తగా జన్మించిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చడానికి వారి మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు అవసరం ఉంటాయి.
మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునే విధానం…
రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం మీ సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మీసేవా కేంద్రంలో లభించే FSC Correction Form (ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కరెక్షన్ ఫారమ్) తీసుకోవాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్ పోర్టల్ నుంచి కూడా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఫారమ్‌లో మీ పాత రేషన్ కార్డు నంబర్, కొత్తగా చేర్చాలనుకుంటున్న కుటుంబ సభ్యుని పూర్తి పేరు, చిరునామా, ఆధార్ సంఖ్య తదితర వివరాలను ఏ తప్పులూ లేకుండా స్పష్టంగా రాయాలి.
- నింపిన దరఖాస్తు ఫారమ్‌కు అవసరమైన ఆధార్, పుట్టిన తేదీ లేదా వివాహ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేసి అందజేయాలి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత మీసేవా కేంద్రం నుంచి ఇచ్చే రసీదు (Acknowledgment Receipt) ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
- ఈ రసీదుపై ఉన్న దరఖాస్తు సంఖ్య (Application Number) ఆధారంగానే మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి….?
మీరు చేసిన దరఖాస్తును అధికారులు పరిశీలించి ఆమోదించారా లేదా అనేది ఇంట్లో కూర్చునే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలు ఇలా….
- ముందుగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో ఎడమ వైపున ఉన్న FSC Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అందులో కనిపించే Ration Cards Search పై క్లిక్ చేస్తే మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
- అందులో FSC Application Search అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- మీ జిల్లా పేరును ఎంపిక చేసుకుని, మీసేవా రసీదుపై ఉన్న అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి 'Search' పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
- ఒకవేళ మీ పాత రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సరిచూసుకోవాలనుకుంటే.. FSC Search లోకి వెళ్లి రేషన్ కార్డు కాలమ్‌లో మీ కార్డు నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు, కార్డులో నమోదైన సభ్యుల పేర్లన్నీ వివరంగా కనిపిస్తాయి.