...
...
Next Story

MLC Vote Application Status : ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Telangana MLC Vote Application Status : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు సాగుతోంది. అప్లై చేసిన వాళ్లు…. దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

Published on: Oct 9, 2026, 10:34:56 IST
Advertisement

Telangana MLC Vote Application Status : రాష్ట్రంలో రెండు శాసనమండలి పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియను ఎన్నికల అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు తమ ఓటు హక్కు కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు స్టేటస్
ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు స్టేటస్

ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న గ్రాడ్యుయేట్లు తమ అప్లికేషన్ ప్రస్తుతం ఏ దశలో ఉంది…? బీఎల్ఓ (BLO) పరిశీలన పూర్తి అయిందో లేదో, ఓటు ఆమోదం (Approve) పొందిందా లేక ఏవైనా సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు (Reject) గురైందా అనే వివరాలను తెలుసుకోవడం అత్యంత సులభం. మీ అరచేతిలోని మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొన్ని సెకన్లలోనే ఈ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

ఎమ్మెల్సీ ఓటు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం:

  1. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://ceotserms2.telangana.gov.in/ లింక్‌పై క్లిక్ చేయాలి.
  2. హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత అందులో కనిపించే "Form-18 (Graduate's)" అనే ఆప్షన్ వద్దకు వెళ్లాలి.
  3. మీ దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ ఐడీ (Application ID)ని అక్కడ ఉన్న నిర్దేశిత బాక్స్‌లో నమోదు చేయాలి.
  4. వివరాలు నమోదు చేసిన అనంతరం కింద ఉండే "Get Application Status" అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
  5. బటన్ క్లిక్ చేయగానే మీ ఫామ్ వివరాలు, మీరు నమోదు చేసిన డేటా స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
  6. అక్కడ స్క్రీన్‌పై "Current Status" అనే విభాగాన్ని పరిశీలిస్తే.. మీ అప్లికేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఏ స్టేజీలో ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. BLO Verification లేదా Approved అని ఉంటే మీ దరఖాస్తు సరిగ్గా పరిశీలనలో ఉందని లేదా ఆమోదం పొందిందని అర్థం చేసుకోవచ్చు.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 2027తో ముగియనుండటంతో, కొత్తగా ఓటర్ల జాబితా తయారీకి ముందస్తుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబరు 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన పట్టభద్రులు నవంబరు 6 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….

ఓటరు నమోదు కోసం ఫారం-18 నింపాల్సి ఉంటుంది. పట్టభద్రులు సులభంగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల యంత్రాంగం రెండు రకాల అవకాశాలను కల్పించింది.

ఆన్‌లైన్ నమోదు విధానం ద్వారా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in లోకి వెళ్లాలి. 'Graduate MLC Voter Registration (Form-18)' ఆప్షన్‌ను ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ చేసిన ప్రతులను అప్‌లోడ్ చేయాలి.ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని అవసరమైన ధ్రువీకరణ పత్రాల కాపీలతో స్థానిక ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్ విధానం ద్వారా జిల్లా కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఫారం-18 పత్రాలు లభిస్తాయి. ఫారాన్ని పూర్తి చేసి, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన సర్టిఫికేట్ల నకళ్లను జతచేసి నేరుగా లేదా పోస్టు ద్వారా అధికారులకు పంపవచ్చు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks