Telangana Ration Card Application Status Check : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కీలకమైన ఆహార భద్రతా కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి సారించింది.

అర్హులైన పౌరులు సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటికే అప్లై చేసుకున్న చాలా మందికి అధికారులు పరిశీలన పూర్తి చేసి కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు.
అయితే దరఖాస్తు చేసుకున్న పౌరులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి పౌరసరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తు - స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- ముందుగా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపిస్తున్న 'FSC Search' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- కొత్తగా ఓపెన్ అయ్యే విండోలో 'FSC Application Search' (ఎఫ్‌ఎస్‌సి అప్లికేషన్ సెర్చ్) అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- మొదట మీ జిల్లాను డ్రాప్‌డౌన్ జాబితా నుంచి ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వద్ద ఉన్న మీసేవా అప్లికేషన్ నంబర్‌ను (MeeSeva Application Number) నిర్ణీత బాక్స్‌లో సరిగ్గా టైప్ చేయాలి.
- చివరగా 'Search' (సెర్చ్) బటన్‌పై నొక్కిన వెంటనే మీ దరఖాస్తు ప్రస్తుత స్థితి స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
- అధికారులు మీ దరఖాస్తును ఆమోదించినట్లయితే (Approved) అని ఉంటుంది. కుటుంబ యజమాని పేరుతో పాటు రేషన్ కార్డులో చేర్చిన కుటుంబ సభ్యుల వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి.
- ఇంకా పరిశీలన పూర్తి కానట్లయితే లేదా అధికారులు నిర్ణయం తీసుకోకపోతే 'Pending' లేదా 'Under Process' అని కనిపిస్తుంది.
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నెలకు విడివిడిగా కాకుండా…. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందజేస్తోంది. ఈ ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈకేవైసీ గడువు పొడిగింపు…
{{/usCountry}}రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నెలకు విడివిడిగా కాకుండా…. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందజేస్తోంది. ఈ ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈకేవైసీ గడువు పొడిగింపు…
{{/usCountry}}మరోవైపు రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఆహార భద్రత కార్డులో ఉన్న సభ్యుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానించే ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియ సమయాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించారు.
రేషన్ షాపుల్లో ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో కూడా ఆధార్ ధృువీకరణ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డుతో పాటు, అందులో నమోదైన సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. దీని కోసం రేషన్ డీలర్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.