Telangana Ration Card eKYC : రాష్ట్రంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరూ తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడంతో పాటు, అనర్హులను తొలగించి కేవలం నిజమైన లబ్ధిదారులకు, అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
ఆగస్ట్ 31 వరకు గడువు…

ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం… ఆగస్టు 31వ తేదీ నాటికి రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న కుటుంబ సభ్యులందరూ తమ ఈ-కేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ-కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి….?
- రేషన్ లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లొచ్చు. అక్కడ ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేయడం ద్వారా లేదా ఐరిస్ స్కాన్ విధానం ద్వారా తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు.
- ఒకవేళ రేషన్ దుకాణాల్లో వీలుకాని పక్షంలో… సమీపంలోని మీసేవా కేంద్రాలకు వెళ్లి కూడా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
- రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేసేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.
వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలు ఇవే..!
ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి వెళ్లే సమయంలో లబ్ధిదారులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, కార్డ్ లో పేరు ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులోని వివరాలతో ఈ-పోస్ యంత్రంలోని డేటాను అనుసంధానించి ఈ-కేవైసీని నిర్ధారిస్తారు. కాబట్టి ఆగస్టు 31 గడువు ముగిసేలోపే రేషన్ కార్డుదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవటం ఎలా..?
లబ్ధిదారులు తమ ఈ-కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే సులభంగా స్టేటస్ పరిశీలించుకోవచ్చు.
- ముందుగా https://smartpds.telangana.gov.in/ అధికారిక లింక్‌పై క్లిక్ చేయాలి.
- పోర్టల్ హోం పేజీ ఓపెన్ అయిన తర్వాత… అందులో కనిపించే Beneficiary Details పై నొక్కాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే విండోలో మీ రేషన్ కార్డు నెంబర్ తో పాటు క్యాప్చాను నమోదు చేయాలి.
- ఇక్కడ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో పాటు ఈకేవైసీ స్టేటస్ వివరాలు కూడా కనిపిస్తాయి.
- స్టేటస్ యాక్టివ్, వెరిఫైడ్ అని ఉంటే ఈకేవైసీ పూర్తి అయినట్లు భావించాలి.