...
...
Next Story

IPL 2026 : టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? ఫేక్ ప్రిడిక్షన్‌తో జాగ్రత్త

IPL 2026 : ఓ ఐపీఎల్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో జనాలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారి గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

Published on: Apr 7, 2026, 16:54:52 IST
Advertisement

దేశంలో ఐపీఎల్ ఫీవర్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో చాలా మంది మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు గెలుస్తారు? ఏ టీమ్ మీద బెట్టింగ్ పెట్టాలని కొందరు మీ దగ్గరకు రావొచ్చు. అలాంటి ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

ఐపీఎల్ 2026 (IPL)
ఐపీఎల్ 2026 (IPL)

ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారని సజ్జనార్ చెప్పారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

'టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.' అని సజ్జనార్ అన్నారు.

ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని సజ్జనార్ హెచ్చరించారు. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించామన్నారు.

'ఈ నిఘా నిరంతరం కొనసాగుతుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా, వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.' అని సజ్జనార్ తెలిపారు.

ఐపీఎల్ ట్రాఫిక్.. బాలింత మృతి

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అనంతరం ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సమాచారం. భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లు తీవ్రంగా రద్దీగా మారాయి, దీంతో అత్యవసర వాహనాలు వేగంగా కదలలేకపోయాయి.

అంబులెన్స్‌లో తరలిస్తున్న బిష్ణ.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్‌లో పరిస్థితి విషమించి మరణించింది. ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఆసుపత్రికి చేరకముందే అంబులెన్స్‌లోనే చనిపోయింది. మరణించిన మహిళకు 26 రోజుల పసికందుతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటన దురదృష్టకరమైనది వ్యాఖ్యానించారు. మ్యాచ్ సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి రోడ్లపై మోహరించారని తెలిపారు. ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం సమీపంలో అంబులెన్స్‌ను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళడానికి అనుమతించారని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe