అధునాతన రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ మెషిన్ ప్రారంభించిన సజ్జనార్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేతులమీదగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌లో అధునాతన రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ మెషిన్ ప్రారంభించింది. దీనిద్వారా హిప్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం, వేగవంతంగా కోలుకొనే అవకాశం ఉంటుంది ఆసుపత్రి వెల్లడించింది.

Published on: Jan 21, 2026, 15:53:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆర్థోపెడిక్ చికిత్స రంగంలో మరో కీలక అడుగు వేసింది. ఆధునిక రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీనిద్వారా కచ్చితత్వం, రోగి జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సలను మరింత బలోపేతం చేసింది.

వైద్యులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్
వైద్యులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్

ఈ అత్యాధునిక సౌకర్యాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్, డాక్టర్ అనిల్ కృష్ణ(మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) డా.ఉదయ్ కృష్ణ మైనేని(సీనియర్ కన్సల్టెంట్, హెచ్‌ఓడీ అండ్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హరి కృష్ణ, హాస్పిటల్ ఉన్నతాధికారులు, వైద్య నిపుణుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ 'ఆధునిక రోబోటిక్ టెక్నాలజీని వైద్య సేవల్లో తీసుకురావడం అనేది నేటి ఆరోగ్యరంగం తీసుకుంటున్న దిశకు నిదర్శనం. ఇది అధిక కచ్చితత్వం, భద్రత, వేగవంతమైన కోలుకునే అవకాశాలను రోగులకు అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు వైద్య సేవల ప్రమాణాలను మరింత పెంచుతాయి.' అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రవేశపెట్టిన ఈ రోబోటిక్ ప్లాట్‌ఫాం, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ కేంద్రాల్లో వినియోగిస్తున్న స్ట్రైకర్ సంస్థకు చెందిన మాకో (MAKO) రోబోటిక్ సిస్టమ్ వంటి గ్లోబల్‌గా గుర్తింపు పొందిన సాంకేతికతపై ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థ ద్వారా శస్త్రచికిత్సకు ముందస్తు ప్రణాళికను, శస్త్రచికిత్స సమయంలో తక్షణ మార్గదర్శకంతో అనుసంధానం చేసి, ప్రతి రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా శస్త్రచికిత్సను నిర్వహించవచ్చు. ఇది ముఖ్యంగా హిప్ రీప్లేస్‌మెంట్, పార్టియల్ నీ రీప్లేస్‌మెంట్, టోటల్ నీ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ సాంకేతికత గురించి డా.ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడారు. రోబోటిక్ సహకారంతో ఇంప్లాంట్ స్థానం, అలైన్‌మెంట్‌లో అత్యున్నత కచ్చితత్వం సాధ్యమవుతుందన్నారు. ఇది సంక్లిష్ట జాయింట్ మార్పిడి శస్త్రచికిత్సల్లో దీర్ఘకాల ఫలితాలకు కీలకమని చెప్పారు. ఈ టెక్నాలజీ సర్జన్ నైపుణ్యానికి పొడిగింపులా పనిచేస్తుందన్నారు. సరైన రోగుల ఎంపికలో భద్రతను రాజీ పడకుండా, త్వరితగతిన నడవగలగడం, కొన్ని సందర్భాల్లో అదే రోజు డిశ్చార్జ్ కూడా సాధ్యమవుతుందని తెలిపారు.

'మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక సాంకేతికతను అనుభవజ్ఞులైన వైద్య బృందాలతో సమన్వయం చేయడమే మా ప్రధాన లక్ష్యం. రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ ప్రవేశపెట్టడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన చికిత్సలను దేశీయంగా అందించగలుగుతున్నాం.' అని డాక్టర్ అనిల్ కృష్ణ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More