హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఉన్న ప్రముఖ ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు పెంచేందుకు ఏకంగా రూ. 1,108.27 కోట్ల భారీ నిధులతో పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం G.O.Rt.No.928, G.O.Rt.No.929 పేరిట రెండు ప్రత్యేక జీవోలను విడుదల చేసింది. మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని మంచిరేవులలో ప్రాచీన ఆలయంగా పేరొందిన ఓంకారేశ్వర స్వామి దేవాలయ సముదాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రభుత్వం రూ. 948.65 కోట్లను కేటాయించింది.
వైభవంగా కనిపించే విధంగా భవ్యమైన రాజగోపురాలు, చుట్టూ ప్రాకారాల నిర్మాణం చేపట్టనున్నారు. ధార్మిక కార్యక్రమాలు, హోమాల నిర్వహణ కోసం ఆధ్యాత్మిక రీతిలో యాగశాల, అలాగే భక్తుల పవిత్ర స్నానాల కోసం పుష్కరిణిని సిద్ధం చేస్తారు. విచ్చేసే భక్తులకు క్యూ లైన్లు, విశ్రాంతి మండపాలు, ప్రసాద వితరణ కేంద్రాలు, విస్తృతమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులతో పాటు, ఆయా పరిసర ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం మరో రూ. 159.62 కోట్లతో 6 లేన్ల ప్రధాన రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 30 మీటర్లు (100 అడుగులు) వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డును అత్యంత ఆధునికంగా నిర్మించనున్నారు.
ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్ విండ్ విల్లాస్ వరకు సుమారు 2.50 కిలోమీటర్ల పొడవునా ఈ కనెక్టివిటీ రహదారి విస్తరించి ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రేహౌండ్స్ కమాండో శిక్షణ కేంద్రం, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానం ఏర్పడుతుంది.
{{/usCountry}}ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్ విండ్ విల్లాస్ వరకు సుమారు 2.50 కిలోమీటర్ల పొడవునా ఈ కనెక్టివిటీ రహదారి విస్తరించి ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రేహౌండ్స్ కమాండో శిక్షణ కేంద్రం, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానం ఏర్పడుతుంది.
{{/usCountry}}రాబోయే రోజుల్లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కారిడార్‌తో ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి ఇది నేరుగా అనుసంధానమవుతుంది. ఆలయ ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా, ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా రూపుదిద్దుకునేందుకు ప్రభుత్వం G.O.Rt.No.929 ద్వారా ఉన్నతస్థాయి టెక్నికల్ కమిటీని నియమించింది.
రూ. 700 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రధాన ఆలయ పనులకు ఈ కమిటీ పూర్తి సాంకేతిక మార్గదర్శకత్వం వహిస్తుంది. ఆలయ డిజైన్లు, డీపీఆర్‌ల పరిశీలన, నిర్మాణ వ్యయం ఖరారు, టెండర్ల ప్రక్రియ నిర్వహణలో ఈ కమిటీకి కీలక బాధ్యతలు కేటాయించారు.
టెక్నికల్ కమిటీ సభ్యుల వివరాలు.. ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్, కో-చైర్మన్‌గా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, కన్వీనర్‌గా హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్, సభ్యులుగా దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్, ప్రముఖ ఆలయ ఆర్కిటెక్చర్ నిపుణుడు డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా ఉంటారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకోనున్న ఈ మంచిరేవుల ఓంకారేశ్వర క్షేత్రం, భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలోనే ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.