Hyderabad MMTS : ప్రయాణికులకు అలర్ట్ - పలు ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు..! రూట్ల వారీగా వివరాలు
Hyderabad MMTS Trains : హైదరాబాద్‌లో నిత్యం ప్రయాణించే ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. పలు కారణాల రీత్యా జూన్ 10 నుంచి జూన్ 12 వరకు నగరంలోని పలు మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
Hyderabad MMTS trains cancelled : ఎంఎంటీఎస్ (MMTS) రైలు సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. రైల్వే నెట్‌వర్క్ నిర్వహణ, కొన్ని కార్యాచరణ కారణాల వల్ల నగరంలోని పలు కీలక మార్గాల్లో నడిచే కొన్ని నిర్దిష్ట ఎంఎంటీఎస్ రైళ్లను జూన్ 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

నిత్యం వేలాది మంది ప్రయాణించే ఐటీ కారిడార్ మార్గాలతో పాటు ఇతర ఉప నగరాలను అనుసంధానించే రైళ్లు ఈ జాబితాలో ఉండటంతో ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను ముందే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏయే రైళ్లు ఏయే స్టేషన్ల మధ్య రద్దయ్యాయో ఇక్కడ తెలుసుకోండి…
పాక్షికంగా రద్దు - ఎంఎంటీఎస్ రైళ్ల పూర్తి వివరాలు:
- ఫలక్‌నుమా - రామచంద్రాపురం (రైలు నంబర్ 47155) : ఈ రైలు సాధారణంగా పలక్‌నుమా నుంచి రామచంద్రాపురం వరకు నడుస్తుంది. జూన్ 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ రైలును లింగంపల్లి - రామచంద్రాపురం స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అంటే ఈ మూడు రోజులు ఈ రైలు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి కేవలం లింగంపల్లి వరకే నడుస్తుంది.
- రామచంద్రాపురం - హైదరాబాద్ (రైలు నంబర్ 47142) : ఈ రైలు రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. జూన్ 10 నుంచి జూన్ 12 వరకు ఈ సర్వీసును రామచంద్రాపురం - లింగంపల్లి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దీనివల్ల ఈ రైలు రామచంద్రాపురం నుంచి కాకుండా, నేరుగా లింగంపల్లి స్టేషన్ నుంచే హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.
- ఘట్ కేసర్ - రామచంద్రాపురం (రైలు నంబర్ 47253) : మేడ్చల్, మల్కాజ్‌గిరి పరిసరాల మీదుగా ఐటీ హబ్‌ను కలిపే ఈ రైలు జూన్ 10, 11 తేదీల్లో సనత్‌నగర్ - రామచంద్రాపురం మధ్య నడవదు. ఆయా రోజుల్లో ఈ సర్వీస్ కేవలం ఘటకేసర్ నుంచి సనత్‌నగర్ వరకే పరిమితం కానుంది.
- రామచంద్రాపురం - ఘట్ కేసర్ (రైలు నంబర్ 47254) : తిరుగు ప్రయాణంలో నడిచే ఈ రైలును కూడా జూన్ 10, 11 తేదీల్లో రామచంద్రాపురం - సనత్‌నగర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ సర్వీస్ నిర్దేశిత రోజుల్లో సనత్‌నగర్ స్టేషన్ నుంచే ప్రారంభమై ఘటకేసర్‌కు చేరుకుంటుంది.
ఈ తాత్కాలిక మార్పుల వల్ల ముఖ్యంగా లింగంపల్లి, సనత్‌నగర్, రామచంద్రాపురం, ఘట్ కేసర్ మార్గాల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. రైళ్ల రాకపోకల సమయాలు, మరిన్ని తాజా వివరాల కోసం ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

