హైదరాబాద్ : షీ టీమ్స్‌కు 1,149 ఫిర్యాదులు.. 3,826 మంది అరెస్ట్.. ఎక్కువగా బ్లాక్‌మెయిలింగ్!

హైదరాబాద్‌లో షీ టీమ్స్ 1149 ఫిర్యాదులను పరిష్కరించింది. 3826 మందిని అరెస్ట్ చేశారు. డిజిటల్ బ్లాక్‌మెయిల్, సైబర్‌స్టాకింగ్, పబ్లిక్ ప్లేస్‌లో వేధింపులు వంటివి ఇందులో ఉన్నాయి.

Published on: Jan 26, 2026, 10:08:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో 2025లో షీ టీమ్స్ 1,149 ఫిర్యాదులను పరిష్కరించింది. వివిధ రకాల వేధింపులకు పాల్పడిన 3,826 మందిని అరెస్టు చేసినట్టుగా హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిజిటల్ బ్లాక్‌మెయిల్, సైబర్‌స్టాకింగ్, పబ్లిక్ ప్లేస్‌లో వేధింపులు వంటి నేరాలపై షీ టిమ్స్ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రతి ఫిర్యాదును తీవ్రత, గోప్యతతో పరిశీలిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు.

హైదరాబాద్ షీ టీమ్స్
హైదరాబాద్ షీ టీమ్స్

పోలీసుల ప్రకారం, బ్లాక్‌మెయిల్ అత్యంత సాధారణ సైబర్ సంబంధిత నేరంగా ఉంది. ప్రైవేట్ ఛాయాచిత్రాలను లేదా రికార్డ్ చేసిన వీడియో కాల్‌లను దుర్వినియోగం చేస్తామని చాలా బెదిరిస్తున్నారు. నీ ప్రైవేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నీతో దిగిన మీ ఫొటోలను మీ ఇంట్లో వాళ్లకు పంపిస్తాను అంటూ బెదిరించిన తర్వాత 366 మంది బాధితులు షీ టీమ్స్‌ను సంప్రదించారు.

బ్లాక్‌మెయిలింగ్ సమస్య నిజానిగి ఎక్కువగా ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పరిచయం అవుతారు. నమ్మించి చనువు పెంచుకుంటారు. ఆ తర్వాత వీడియో కాల్స్, పర్సనల్ ఫొటోలతో ఆట మెుదలుపెడతారు. ఇక కొంతమంది ఎక్స్ లవర్స్‌ కూడా పాత ఫొటోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాతో మాట్లాడకపోయినా.. వేరే పెళ్లి చేసుకున్నా.. పాత ఫొటోలను బయటపెడతా అంటూ బెదిరించినవారు ఉన్నారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్‌కు సంబంధించి 366 కేసులు నమోదు అయ్యాయి.

ఇంటర్నెట్ కాల్స్ ద్వారా అర్ధరాత్రి వేధింపులకు సంబంధించిన 121 కేసులు, ఫేక్ ప్రొఫైల్స్, అశ్లీల కంటెంట్ ప్రసరణకు సంబంధించిన 82 కేసులను కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో కొన్ని సందర్భాల్లో గుర్తించలేని నంబర్‌లు, ఆన్‌లైన్ ఖాతాలను గుర్తించడానికి ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

వివాహం పేరుతో మహిళలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన 98 కేసులను షీ టీమ్స్ పరిష్కరించింది. ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. పెళ్లి అనగానే ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అమ్మాయిలను నమ్మించి శారీరంగా, ఆర్థికంగా ఉపయోగించుకుంటున్నారు. షీ టీమ్స్ బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాదు.. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంది.

సాధారణ దుస్తుల్లో ఉంటూ షీ టీమ్స్ బస్ స్టేషన్లు, కళాశాలలు, ఇతర రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలోనూ నిఘా పెడతాయి. పట్టుబడిన వారిలో ఎక్కువ మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు అధికారులు. ఇక తీవ్రమైన కేసుల్లో అరెస్టులు, రియు జ్యుడీషియల్ కస్టడీలు ఉన్నాయి.

మహిళలు ఎలాంటి వేధింపులను అయినా భయం లేకుండా ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర నంబర్ 100ను సంప్రదించవచ్చు లేదా వాట్సాప్ నెంబర్ 9490616555 ద్వారా షీ టీమ్స్‌ను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More