ఐఐటీ హైదరాబాద్ కేవలం విద్య, వృత్తిపరమైన నైపుణ్యాలకే పరిమితం కాకుండా విద్యార్థులలో మానవతా విలువలు, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా "మంచితనం" (Goodness) అనే అంశంపై క్రెడిట్ పొందేందుకు వీలుగా ఒక ప్రత్యేక అకడమిక్ కోర్సును ప్రారంభించింది.

"గుడ్‌నెస్: క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఫ్లోరిషింగ్" (Goodness: Character, Responsibility and Human Flourishing - LA2270) పేరుతో ఈ ఒక క్రెడిట్ (1-Credit Elective) ఆప్షనల్ కోర్సును అధికారులు ప్రవేశపెట్టారు.
ఈ కోర్సును బి.టెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, బి.డిజైన్ (BDes) చదువుతున్న విద్యార్థులందరూ ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి ముందస్తు అర్హతలు అవసరం లేదు. ఐఐటీ హైదరాబాద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కోర్సు ప్రారంభమైన వెంటనే 140 మందికి పైగా విద్యార్థులు దీనిలో చేరడం విశేషం.
ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్‌నెస్ ప్రతిపాదించగా ఐఐటీ హైదరాబాద్ దీనిని ఆమోదించి అధికారిక అకడమిక్ క్రెడిట్ కోర్సుగా అమలు చేస్తోంది.
కేవలం ఆదాయం, పదవులే విజయం అనుకునే ఈ రోజుల్లో అసలైన మంచి జీవితం అంటే ఏమిటి? సమాజం పట్ల ఒక వ్యక్తికి ఉండాల్సిన బాధ్యతలేంటి? అనే అంశాలపై విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. మొత్తం 7 సెషన్లలో సాగే ఈ కోర్సులో పలు అంశాలను కవర్ చేస్తారు.
- గుడ్‌నెస్ ఇండెక్స్ ఫ్రేమ్‌వర్క్: మంచితనాన్ని అంచనా వేసే విధానం.
హ్యూమన్ ఫ్లోరిషింగ్: జీవితంలోని శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిమాణాలు.
{{/usCountry}}హ్యూమన్ ఫ్లోరిషింగ్: జీవితంలోని శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిమాణాలు.
{{/usCountry}}క్యారెక్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవిడెండ్: వ్యక్తిత్వ నిర్మాణం, దాని వల్ల సమాజానికి జరిగే ప్రయోజనం.
పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ: వ్యక్తిగత సామాజిక బాధ్యత.
వికసిత్ భారత్ : మంచితనానికి, నవ భారత నిర్మాణానికి ఉన్న సంబంధం.
విద్యార్థులకు ఏదో ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని రుద్దకుండా, మంచితనాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడం, రోజువారీ జీవితంలో దానిని ఎలా ఆచరణలో పెట్టవచ్చో తెలుసుకోవడానికి ఈ కోర్సు తోడ్పడుతుంది. కేవలం థియరీగా నేర్చుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో తాము ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారనే అంశంపై విద్యార్థుల రిఫ్లెక్షన్‌తో ఈ కోర్సు ముగుస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక స్పృహ ఉన్న ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా విద్యావేత్తల ప్రశంసలు అందుకుంటోంది.