నైరుతి రుతుపవనాల సీజన్‌లో అత్యంత కీలమైన జూలై నెల ప్రారంభంలో తీవ్ర నిరాశపరిచినా.. ఆ తర్వాత పుంజుకుని రాష్ట్రంలో వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. జూలై నెల మొదట్లో రాష్ట్రంలో వర్షాలు కురవక పోవడంతో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. జూలై 16 నాటికి తెలంగాణలో ఏకంగా 61 శాతం మేర భారీ వర్షపాత లోటు ఏర్పడటంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే నెల రెండో భాగంలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన విస్తారమైన వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నెల ముగిసే సమయానికి వర్షపాత లోటు దాదాపుగా కవర్ అయింది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. సాధారణంగా జూలై నెలలో రావాల్సిన 227.6 మి.మీ. వర్షపాతానికి గాను, ఈ ఏడాది 224.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే నెల ముగిసేసరికి వర్షపాత లోటు కేవలం 1 శాతానికి మాత్రమే పరిమితమైంది.
జూలై రెండో అర్ధభాగంలో కురిసిన వర్షాల కారణంగా జూన్ 1 నుండి జూలై 31 వరకు రాష్ట్రంలో మొత్తం 339.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా రావాల్సిన 357.9 మి.మీ.తో పోలిస్తే లోటు కేవలం 5 శాతానికి పడిపోయింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం సాధారణంగా రావాల్సిన 276 మి.మీ.కి గాను 236.5 మి.మీ. వర్షపాతం మాత్రం నమోదై 14 శాతం లోటుతో వెనుకబడి ఉన్నాయి.
జిల్లా వారీగా నమోదైన వర్షపాతంలోనూ గణనీయమైన మార్పు కనిపించింది. జూలై 16 నాటికి కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా 27 జిల్లాలు లోటు వర్షపాతాన్ని, హనుమకొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు తీవ్ర లోటు కేటగిరీలో ఉన్నాయి. అయితే తర్వాతి రెండు వారాల్లో కురిసిన వర్షాల కారణంగా అనేక జిల్లాలు లోటు నుంచి బయటపడ్డాయి.
జూలై 31 నాటికి మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతంతో 'అధిక వర్షపాతం' జాబితాలోకి చేరాయి. హైదరాబాద్, రంగారెడ్డితో సహా మొత్తం 17 జిల్లాలు సాధారణ వర్షపాతంతో నెలను ముగించాయి. లోటు నమోదైన జిల్లాల సంఖ్య 12కి తగ్గగా, ఏ జిల్లా కూడా తీవ్ర లోటు కేటగిరీలో లేదు. హనుమకొండ, జనగామ, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి.
{{/usCountry}}జూలై 31 నాటికి మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతంతో 'అధిక వర్షపాతం' జాబితాలోకి చేరాయి. హైదరాబాద్, రంగారెడ్డితో సహా మొత్తం 17 జిల్లాలు సాధారణ వర్షపాతంతో నెలను ముగించాయి. లోటు నమోదైన జిల్లాల సంఖ్య 12కి తగ్గగా, ఏ జిల్లా కూడా తీవ్ర లోటు కేటగిరీలో లేదు. హనుమకొండ, జనగామ, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి.
{{/usCountry}}జూన్ నెలాఖరుతో పోలిస్తే ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో 130.3 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 115.3 మి.మీ. వర్షం కురిసి 12 శాతం లోటుతో ముగిసింది. ఆ సమయంలో కేవలం నాలుగు జిల్లాలు మాత్రమే అధిక వర్షపాతంలో ఉండగా, 16 జిల్లాలు లోటును, హనుమకొండ 71 శాతం లోటుతో తీవ్ర లోటును చూశాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా కురిసిన రుతుపవనాల ప్రభావంతో వర్షపాత పరిస్థితి మారిపోయింది.