దసరా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది పలు ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునే ప్లాన్ లో ఉంటున్నారు. అయితే తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన అరుణాచలం (తిరువణ్ణామలై), కాంచీపురంలతో పాటు అందమైన పుదుచ్చేరిని సందర్శించేందుకు 'అరుణాచల మోక్ష యాత్ర' పేరుతో ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ప్రతి వారం శుక్రవారం అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం ఈ యాత్ర అక్టోబర్ 9, 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. జర్నీ తేదీ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. మొదటి రోజు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం బయలుదేరుతారు. ఈ యాత్ర 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగుతుంది.
- మొదటి రోజు : సాయంత్రం 5:00 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలు నంబర్ 17653 (కాచిగూడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు : ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి(పాండిచ్చేరి) స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు వెళ్లి చెక్-ఇన్ అయిన తర్వాత అరవిందాశ్రమం, ఆరోవిల్, ప్రశాంతమైన పారడైజ్ బీచ్‌లను సందర్శిస్తారు. ఆ రాత్రికి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
- మూడో రోజు : ఉదయాన్నే హోటల్‌లో టిఫిన్ ముగించుకుని దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణ్ణామలై (అరుణాచలం)కి బయలుదేరుతారు. హోటల్‌లో చెక్-ఇన్ అయ్యాక, ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు : ఉదయం టిఫిన్ తర్వాత హోటల్ చెక్-అవుట్ చేసి కాంచీపురం (120 కి.మీ) ప్రయాణమవుతారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం అరక్కోణం స్టేషన్‌కు (30 కి.మీ) చేరుకుని, సాయంత్రం 6:05 గంటలకు రైలు నంబర్ 17651 ద్వారా తిరుగు ప్రయాణం అవుతారు.
- ఐదో రోజు : ఉదయం 7:50 గంటలకు రైలు…. కాచిగూడ స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3 ఏసీ), సైట్‌సీయింగ్ కోసం ఏసీ వాహన వసతి (షేరింగ్ ప్రాతిపదికన), రెండు రోజులు హోటల్ బస విత్ బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి. ఆసక్తి ఉన్న భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ధరల వివరాలు కూడా ఇక్కడే చూడొచ్చు. ఇతర సమాచారం కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని లేదా 8287932229 / 8287932228 / 9701360701 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3 ఏసీ), సైట్‌సీయింగ్ కోసం ఏసీ వాహన వసతి (షేరింగ్ ప్రాతిపదికన), రెండు రోజులు హోటల్ బస విత్ బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి. ఆసక్తి ఉన్న భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ధరల వివరాలు కూడా ఇక్కడే చూడొచ్చు. ఇతర సమాచారం కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని లేదా 8287932229 / 8287932228 / 9701360701 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
{{/usCountry}}