IRCTC Coastal Karnataka Tour Package : పర్యాటకులు, ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. "కోస్టల్ కర్ణాటక" పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, సుందరమైన తీరప్రాంతాలను సందర్శించవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ ప్యాకేజీ హైదరాబాద్‌లోని కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం ప్రారంభమవుతుంది.

ప్రసుతం ఈ ప్యాకేజీ ఆగస్టు 11, 2026న అందుబాటులో ఉంది. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులు ఉడిపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, శృంగేరి, హోరనాడు, మంగళూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
టూర్ షెడ్యూల్ :
- మొదటి రోజు (మంగళవారం) : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు రైలు నంబర్ 12789 (కాచీగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు (బుధవారం) : ఉదయం 09:15 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, మాల్పే బీచ్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది.
- మూడో రోజు (గురువారం) : ఉదయాన్నే కొల్లూరు బయలుదేరి ప్రసిద్ధ మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్ వెళ్లి, అక్కడి భారీ శివుని విగ్రహాన్ని…. దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం గోకర్ణ చేరుకుని ఆలయం, బీచ్ చూసిన తర్వాత తిరిగి ఉడిపిలోని హోటల్‌కు చేరుకుంటారు.
- నాలుగో రోజు (శుక్రవారం) : హోటల్ చెకౌట్ చేసి హోరనాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని దర్శిస్తారు. తర్వాత శృంగేరి వెళ్లి శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రానికి మంగళూరు చేరుకుంటారు. ఆ రాత్రి మంగళూరులోనే బస చేస్తారు.
- ఐదో రోజు (శనివారం) : మంగళూరులోని మంగళాదేవి ఆలయం, కద్రి మంజునాథ స్వామి ఆలయం, కుద్రోలి గోకర్ణనాథ ఆలయం మరియు తన్నీరుభావి బీచ్‌ను చూస్తారు. సాయంత్రం 19:00 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 20:00 గంటలకు రైలు నంబర్ 12790 ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
- ఆరో రోజు (ఆదివారం ): రాత్రి 23:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే….. స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) క్లాస్ లో సింగిల్ షేరింగ్ రూ. 39,920, ట్విన్ షేరింగ్ రూ. 21,370, ట్రిపుల్ షేరింగ్ రూ. 16,500గా నిర్ణయించారు. కంఫర్ట్ (3AC) క్లాస్ లో అయితే సింగిల్ షేరింగ్ రూ. 42,990, ట్విన్ షేరింగ్ రూ. 24,440, ట్రిపుల్ షేరింగ్ రూ. 19,560 కాగా.. బెడ్‌తో ఉన్న పిల్లలకు రూ. 12,490, బెడ్ లేని పిల్లలకు రూ. 11,090 ఛార్జ్ చేస్తారు.
{{/usCountry}}ఈ ప్యాకేజీ ధరలు చూస్తే….. స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) క్లాస్ లో సింగిల్ షేరింగ్ రూ. 39,920, ట్విన్ షేరింగ్ రూ. 21,370, ట్రిపుల్ షేరింగ్ రూ. 16,500గా నిర్ణయించారు. కంఫర్ట్ (3AC) క్లాస్ లో అయితే సింగిల్ షేరింగ్ రూ. 42,990, ట్విన్ షేరింగ్ రూ. 24,440, ట్రిపుల్ షేరింగ్ రూ. 19,560 కాగా.. బెడ్‌తో ఉన్న పిల్లలకు రూ. 12,490, బెడ్ లేని పిల్లలకు రూ. 11,090 ఛార్జ్ చేస్తారు.
{{/usCountry}}ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com వెబ్ సైట్ లో ఈ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.