...
...
Next Story

Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ, నాసిక్ టూర్ - ఈనెలలోనే జర్నీ! IRCTC ప్యాకేజీ వివరాలివే

IRCTC Shirdi Tour Package : సాయిబాబా భక్తులకు అలాగే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ తీపి కబురు అందించింది. "సాయి శివం" (SAI SHIVAM) పేరుతో ఒక ప్రత్యేకమైన రైలు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

Published on: Sep 15, 2026, 12:30:51 IST
Advertisement

IRCTC Shirdi Tour Package : షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? కొంచెం తక్కువ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘సాయి శివం’ పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.

షిర్డీ సాయిబాబా ఆలయం
షిర్డీ సాయిబాబా ఆలయం

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 25వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆసక్తిగల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టూర్ షెడ్యూల్ ఇలా…

  • మొదటి రోజు (శుక్రవారం): ప్రయాణం సాయంత్రం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. రైలు నంబర్ 17064 అజంతా ఎక్స్‌ప్రెస్ ద్వారా సాయంత్రం 06:30 గంటలకు రైలు బయలుదేరుతుంది. కాచిగూడతో పాటు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసార్ స్టేషన్లలో కూడా భక్తులు ఈ రైలు ఎక్కవచ్చు. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు (శనివారం): ఉదయం 07:10 గంటలకు మహారాష్ట్రలోని నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన వాహనంలో షిర్డీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయి, టిఫిన్ చేసిన తర్వాత భక్తులు తమ సొంత ఖర్చులతో సాయిబాబా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం సమయం షిర్డీలో గడపవచ్చు. రాత్రికి షిర్డీలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు (ఆదివారం): ఉదయం హోటల్‌లో ఉచిత అల్పాహారం ముగించుకుని, చెకౌట్ అవుతారు. అక్కడ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరం బయలుదేరుతారు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత నాసిక్‌కు చేరుకుంటారు. అక్కడ పంచవటి ప్రాంతాన్ని సందర్శిస్తారు. (గమనిక: పంచవటి ప్రాంతంలో పెద్ద వాహనాలకు అనుమతి ఉండదు కాబట్టి భక్తులు సొంత ఖర్చులతో ఆటోలలో తిరగాల్సి ఉంటుంది). సాయంత్రం నాసిక్ నుంచి తిరిగి నాగర్‌సోల్ స్టేషన్‌కు (90 కి.మీ) చేరుకుని, రాత్రి 09:20 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ (Train No. 17063) లో తిరుగు ప్రయాణమవుతారు.
  • నాలుగో రోజు (సోమవారం): ఉదయం 09:45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.రూ. 11,560 ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 9,430,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9,240గా ఉంది. 3ఏసీ కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్(స్లీపర్ క్లాస్) లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,550, డబుల్ షేరింగ్ కు రూ. 7,740, సింగిల్ షేరింగ్ కు రూ. 9,870గా నిర్ణయించారు.

బుకింగ్ కోసం భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సందర్శించవచ్చు లేదా సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని (ఫోన్: 040-27702407, 9701360701) నేరుగా సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks