...
...
Next Story

IRCTC Karnataka Tour : హైదరాబాద్ టు కర్ణాటక ట్రిప్ - 6 రోజుల టూర్ ప్యాకేజీ, బడ్జెట్ ధరలోనే..!

కర్ణాటకలోని పలు ప్రముఖ ప్రాంతాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. మొత్తం 6 రోజుల టూర్ ఉంటుంది.

Published on: Mar 8, 2026, 11:57:48 IST
Advertisement

సమ్మర్ స్టార్ట్ అయిపోయింది..! ఇక చాలా మంది టూర్లు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే మీకోసం ఐఆర్సీటీసీ… బడ్జెట్ ధరలోనే కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.

కర్ణాటక టూర్ ప్యాకేజీ (istock image)
కర్ణాటక టూర్ ప్యాకేజీ (istock image)

"కోస్టల్ కర్ణాటక' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 17 మార్చి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో తెలుసుకోవచ్చు.

కర్ణాటక టూర్ - 6 రోజుల షెడ్యూల్ :

  • మొదటి రోజు : కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు ట్రైన్ (మంగళూర్ సెంట్రల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ 12789) బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు.
  • రెండో రోజు : ఉదయం 9.15 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.
  • 3వ రోజు : ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా(Mookambika) ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.
  • 4వ రోజు :హొర్నాడు కు చేరుకుంటారు. అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి శృంగేరికి బయల్దేరుతారు. శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంచుకుంటారు. సాయంత్రం తిరిగి మంగళూరుకు వెళ్తారు.
  • 5వ రోజు :ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కదిరిమంజునాత టెంపుల్ కు వెళ్తారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ (Train No. 12790) అవుతుంది.
  • 6వ రోజు : మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,970గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 38600గా ఉండగా…. డబుల్ షేరింగ్ కు రూ. 20650, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15970 గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe