ప్రకృతి అందాలకు నిలయమైన ఊటీ, కూనూర్ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. 'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' (ప్యాకేజీ కోడ్ - SHR094) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
6 రోజుల టూర్ షెడ్యూల్ ఇలా…

5 రాత్రులు, 6 రోజులు ఉంటే ఈ ప్యాకేజీ… సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ధరలోనే దక్షిణ భారతదేశపు అత్యంత సుందరమైన హిల్ స్టేషన్లలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ప్రస్తుతం నవంబర్ 17వ తేదీకి టికెట్లు ఉన్నాయి. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.
- తొలిరోజు మధ్యాహ్నం 14:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 20629) ద్వారా టూర్ ప్రారంభమవుతుంది. గుంటూరు, తెనాలి, నల్గొండ మీదుగా ప్రయాణికులు ఈ రైలులో ఎక్కే సౌకర్యం ఉంది.
- మరుసటి రోజు ఉదయం 09:10 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో (రోడ్డు మార్గాన 90 కి.మీ) ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన అనంతరం, మధ్యాహ్నం వేళ ఊటీలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్స్, అందమైన ఊటీ లేక్‌లను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోని హోటల్‌లోనే బస ఉంటుంది.
- హోటల్‌లో అల్పాహారం ముగించుకుని ఊటీలోనే ఎత్తైన దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, అలరించే పైకారా జలపాతాలను చూసేందుకు బయలుదేరుతారు. ఈ రోజంతా కొండ ప్రాంతపు ఆహ్లాదాన్ని ఆస్వాదించిన పిమ్మట రాత్రికి ఊటీలో బస చేస్తారు.
- ఉదయాన్నే టిఫిన్ చేసి, సుందరమైన తేయాకు తోటలకు పేరుగాంచిన కూనూర్ సందర్శనకు వెళ్తారు. అక్కడి పర్యాటక ప్రదేశాలను తిలకించిన అనంతరం మధ్యాహ్నానికి మళ్లీ ఊటీకి తిరిగివచ్చి రాత్రి బస చేస్తారు.
- హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12:00 గంటలకు చెకౌట్ అవుతారు. అనంతరం వాహనంలో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 15:40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్: 20630) ఎక్కి తిరుగు ప్రయాణమవుతారు.
- ఉదయం 11:00 గంటలకు రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ మధురమైన యాత్ర పూర్తవుతుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33,590గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18,890 ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17170గా నిర్ణయించారు.
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 31,050గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16,360, సింగిల్ షేరింగ్ కు రూ. 14,630గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదింవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర వివరాలను కూడా తెలుసుకోవచ్చు.