...
...
Next Story

హైదరాబాద్ టు షిర్డీ - 3 రోజుల పాటు ట్రిప్..! ఈ టూర్ ప్యాకేజీ చూడండి

షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ అక్టోబర్ నెలలోనే జర్నీ ఉంది.

Published on: Oct 19, 2025, 13:34:27 IST
Advertisement

షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? కొంచెం తక్కువ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘SAI SANNIDHI EX HYDERABAD’ పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.

జర్నీ డేట్ ఇదే…

షిర్డీ టూర్ ప్యాకేజీ
షిర్డీ టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్లాన్ చేసింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 29 అక్టోబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.

  • ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో జర్నీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064) ఉంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఇక 2వ రోజు ఉదయం 07.10 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్‌ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెకౌట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
  • మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరలు ఎంతంటే..?

ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరు భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే బుకింగ్ ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe