తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మహానగరానికే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అవతలి ప్రాంతంలో కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా జీసీసీ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖ సంబంధిత అంశాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “బియాండ్ క్యూర్" (కోర్ అర్బన్ రీజియన్ అవతలి) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైన హెల్త్ సిటీలో ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆదేశించారు. అవసరమైతే ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రపంచంలోనే గొప్ప సదుపాయాలు ఉండేలా ఏఐ సిటీ నిర్మాణం ఉండాలన్నారు.
{{/usCountry}}కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైన హెల్త్ సిటీలో ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆదేశించారు. అవసరమైతే ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రపంచంలోనే గొప్ప సదుపాయాలు ఉండేలా ఏఐ సిటీ నిర్మాణం ఉండాలన్నారు.
{{/usCountry}}ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రీయల్‌లో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రాంగణాల్లో శంకుస్థాపనలకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అక్కడ స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించే డైనమిక్ ఏజెన్సీగా, ఇన్వెస్టర్లకు ఎండ్-టు-ఎండ్ సేవలు అందించే వ్యవస్థగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో ఐటీ, పరిశ్రమల శాఖల అధికారులతో పాటు ఇంధన, ఆర్థిక శాఖల సీనియర్ అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలన్నారు.
పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి కార్యకలాపాల ప్రారంభం అయ్యే వరకు ఆయా సంస్థల అవసరాలన్నింటినీ సమన్వయం చేసేందుకు ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్‌ను కేటాయించాలని రేవంత్ చెప్పారు. మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆపరేటర్లకు బదులుగా టి-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆరు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టి-ఫైబర్‌కు మారడం ద్వారా రూ.54 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి వివరించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ కె.శశాంక, ఐటీ అండ్ సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.