...
...
Next Story

Jai Sri Ram Price : పాతరకం జైశ్రీరాం ధాన్యానికి రికార్డు ధర.. మక్కలకు కూడా

Jai Sri Ram Paddy Price : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పాతరకం జైశ్రీరాం ధాన్యానికి మంచి ధర పలికింది. మరోవైపు వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో పత్తి, మక్కలకు కూడా గరిష్ఠ ధరలు పలుకుతున్నాయి.

Published on: Oct 30, 2026, 10:58:26 IST
Advertisement

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు మంచి రేటు వస్తున్నాయి. ముఖ్యంగా సన్నధాన్యం, పత్తి పంటలకు వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపిస్తుండటంతో క్వింటాల్ ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మహబూబాబాద్‌ మార్కెట్‌లో జైశ్రీరాం ధాన్యం హవా కనిపించింది. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో జైశ్రీరాం పాత రకం సన్నధాన్యానికి ఊహించని రీతిలో ధర లభించింది. జైశ్రీరాం సన్నధాన్యం: క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 5,555 లభించగా, కనిష్ఠ ధర రూ. 3,960 నమోదైంది. వ్యాపారులు సగటున రూ. 5,080 చొప్పున కొనుగోలు చేశారు.

ఇక ఆర్ఎన్ఆర్(RNR) రకం క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 4,885 పలికింది. హెచ్‌ఎంటీ (HMT) రకం గరిష్ఠంగా రూ. 4,930 లభించింది. ఈ రకం సన్న బియ్యానికి మార్కెట్, బ్రాండెడ్ రైస్ మిల్లుల నుంచి నిరంతర డిమాండ్ ఉండటంతో కొనుగోలుదారులు పోటీపడి ఈ వేలంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పత్తి, మొక్కజొన్న ధరలు కూడా రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. ధాన్యంతో పాటు వాణిజ్య పంటలైన పత్తి, మొక్కజొన్నల విక్రయాలు కూడా రైతులకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. మహబూబాబాద్ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 9,021 నమోదు కాగా, కనిష్ఠ ధర రూ. 5,300గా ఉంది. మక్కజొన్న విషయానికొస్తే.. ఇక్కడ క్వింటాలు గరిష్ఠ ధర రూ. 3,051 కాగా, కనిష్ఠ ధర రూ. 2,000 వద్ద నమోదైంది.

ఇతర ప్రధాన మార్కెట్లలో కూడా ఇదే తరహా ధరలు ఉంటున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జైశ్రీరాం రకం గరిష్ఠంగా రూ. 5,018 ధర పలుకగా, ఆర్‌ఎన్‌ఆర్‌ రకం రూ. 4,516, హెచ్‌ఎంటీ రకం ధాన్యం రూ. 2,929 వరకు నమోదయ్యాయి.

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కల ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వ్యాపారుల పోటీ మధ్య క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 3,255 ధర పలికింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks