తెలంగాణలోనూ బీజేపీ - జనసేన కలిసి పని చేయనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కీలక ప్రకటన చేశాయి. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కోసం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.
ఈనెల 7,8 తేదీల్లో పవన్ ప్రచారం…

“జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ… ఫిబ్రవరి 7, 8 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలో ప్రకటిస్తాం” అని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
జనసేన పార్టీ ప్రకటన కంటే ముందే పవన్ కల్యాణ్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీకి పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా ధ్రువీకరిస్తూ ట్వీట్ చేసింది.
ఇటీవలే కొండగట్టు పర్యటనకు వచ్చిన సమయంలోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈసారి తప్పకుండా పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణలోని నాయకత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ తరపున పలుచోట్ల నామినేషన్లను కూడా దాఖలయ్యాయి.
ఇప్పటికే ఏపీలో జనసేన - బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఇరు పార్టీల మధ్య మైత్రికి అడుగుపడినట్లు అయింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ఆకర్షించి… మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
{{/usCountry}}ఇప్పటికే ఏపీలో జనసేన - బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఇరు పార్టీల మధ్య మైత్రికి అడుగుపడినట్లు అయింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ఆకర్షించి… మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
{{/usCountry}}ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ మిశ్రా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది.