జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : తుది దశకు ప్రచారం - ఇవాళ సాయంత్రం మైకులు, నేతల ప్రచారాలు బంద్, ఈనెల 11న పోలింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. చివరి రోజు కావటంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేయనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరింది. ఇవాళ్టితో ప్రచార పర్వానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ప్రచారానికి ఇవాళ ఒక్క రోజు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేయనున్నాయి. ఇక సాయంత్రం 5 తర్వాత మైకులు బంద్ కావటమే కాదు… ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
ఈనెల 11న పోలింగ్
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను ప్రకటిస్తారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కు ముందురోజు ఈ నెల 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, ఆఫీసులకు మాత్రమే సెలవు ఇవ్వగా.. పోలింగ్ రోజు 11వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆఫీసులకు, సంస్థలకు సెలవు ఇచ్చారు.
14వ తేదీన కౌంటింగ్ నాడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట మాత్రమే సెలవు ప్రకటించారు. ఆయా చోట్ల పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక నవంబర్ 9 నుంచి 11 వరకు నియోజకవర్గ పరిధిలోని వైన్స్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వరకు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయి. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు అన్ని మూసివేసి ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. ఆ రోజు కూడా నియోజకవర్గపరిధిలోని అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
భారీ బందోబస్తు…
సిటీ పోలీస్ కు చెందిన 1600 మంది సిబ్బంది పోలింగ్ రోజున విధులు నిర్వహించనున్నారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 38 రూట్ మొబైల్స్, 8 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 డీసీపీ, ఏసీపీల స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 8 క్విక్ రియాక్షన్ టీమ్ లను సిద్ధం చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

