జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన ప్రకారం…. కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీకి 17,061 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.
పోలింగ్ శాతం వివరాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 50.83 శాతం ఓట్లు రాగా… బీఆర్ఎస్ కు 38.13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక బీజేపీకి కేవలం 8.76 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ఖి మాగంటి గోపినాథ్ 16,337 ఓట్ల తేడాతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజహరుద్దీన్ కు 64,212 ఓట్లురాగా.. బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 35.03 శాతం ఓట్లు రాగా… ఈసారి జరిగిన ఉపఎన్నికలో మాత్రం 50.83 శాతం ఓట్లు దక్కాయి. ఈ విక్టరీతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకున్నట్లు అయింది. ఇక బీఆర్ఎస్ కు చూస్తే 2023 ఎన్నికలో 43.94 శాతం ఓట్లు రాగా.. ఈసారి తగ్గింది. బీజేపీకి 14.11 శాతం ఓట్లు వస్తే… ఈసారి జరిగిన ఉప ఎన్నికలో కేవలం 8.76 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో నవీన్ యాదవ్ కు దక్కిన మెజార్టీనే ఎక్కువ. గతంలో మాగంటి, విష్ణువర్థన్ రెడ్డికి వచ్చిన మెజార్టీలు పైస్థానంలో ఉండగా… వాటన్నింటిని దాటి నవీన్ యాదవ్ ఏకంగా 24,729 ఓట్లు తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు.
{{/usCountry}}ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో నవీన్ యాదవ్ కు దక్కిన మెజార్టీనే ఎక్కువ. గతంలో మాగంటి, విష్ణువర్థన్ రెడ్డికి వచ్చిన మెజార్టీలు పైస్థానంలో ఉండగా… వాటన్నింటిని దాటి నవీన్ యాదవ్ ఏకంగా 24,729 ఓట్లు తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు.
{{/usCountry}}