...
...
Next Story

నదీ జలాల కోసం మరో ఉద్యమం.. రేపటి నుంచి కథ వేరే ఉంటది : కేసీఆర్

సమైక్య రాష్ట్రంలో ఎక్కువగా అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించానని చెప్పారు.

Updated on: Dec 21, 2025, 19:09:16 IST
Advertisement

40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. 174 టీఎంసీలు మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందన్నారు. విభజన సమస్యలతో పాలమూరుకు చాలా నష్టం జరిగిందన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని ఎస్ఆర్‌సీలో స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయం మీద బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టీఎంసీలను జూరాలకు సుమోటోగా కేటాయించిందన్నారు.

కేసీఆర్
కేసీఆర్

పాలమూరు, నల్లగొండ జిల్లాల్లను అద్భుతంగా తీర్చిదిద్దామని కేసీఆర్ చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో మూడు నాలుగు రోజుల్లో నేతలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని ఆరోపించారు. ప్రతిపక్షంగా బాధ్యతను నిర్వహిద్దామన్నారు. మరో 20 రోజుల్లో పాలమూరులో భారీ బహిరంగ సభ పెడతామన్నారు. రేపటి నుంచి కథ వేరే ఉంటదని కేసీఆర్ స్పష్టం చేశారు.

అనేక రకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రాష్ట్రం మెుత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. దాని మీద చప్పుడు లేదన్నారు. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే.. దీనిపైనా చప్పుడు లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టుగా అని ప్రశ్నించారు.

'ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా నేనా? ఈ కాంగ్రెస్ సర్కార్ కు ప్రజా సమస్యలు పట్టవా? ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుండి ఇంకో లెక్క. రెండేండ్లు ఓపిక పట్టినం.. ఇగ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో కృష్ణా - గోదావరి జలాల్లో తెలంగాణకు మొదటికే ముప్పు వచ్చింది. అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగిన.. ఊరూరా ప్రజలను తట్టి లేపుతాం. జల దోపిడీని ఎండ గడతాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks