బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితురాలికి జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మీ ‘బేటీ బచావో’ అనేది కేవలం ఒక నినాదానికే పరిమితమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్తరఫ్ ఎప్పుడు చేస్తారో చెప్పాలి అన్నారు. కేంద్రమంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. లేక బండి సంజయ్, ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా అని అడిగారు. నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? లేదా ఆయనను మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో మహిళపై అత్యాచారం జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం కేసు నమోదు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయింది అన్నారు.
'మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పోలీస్ శాఖ ఎందుకు స్పందించలేదు? ఎప్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు మూడు నెలల పాటు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఉన్నావ్ కేసులో బాధితురాలికి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ బాధితురాలికి అండగా నిలబడరా? లేక మీ న్యాయం తెలంగాణ బాధితులకు వర్తించదా?.' అని కేటీఆర్ ప్రశ్నించారు.
బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. "ఏ నిబంధన ప్రకారం ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారు?" అని పోలీసులను నిలదీశారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ వేధించడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం తిరుగుతూ ఆ బాలిక ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు ఆమెనే నిందిస్తూ విక్టిమ్ షేమింగ్ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఫ్రాంచైజీలా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో రెండు పార్టీలు కలిసి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఇతర పోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమారుడిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
{{/usCountry}}తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఫ్రాంచైజీలా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో రెండు పార్టీలు కలిసి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఇతర పోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమారుడిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
{{/usCountry}}'మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఈ ఘటనను చూస్తే అర్థమవుతోంది. గతంలో మన మహిళల గౌరవం కోసం అణచివేతదారులపై, ప్రభుత్వాలపై పోరాడాం. ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు పోరాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.