బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ చేయడంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని దుష్ట శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత రాజకీయ ప్రత్యర్థుల చౌకబారు వ్యూహాలకు తలొగ్గరని నొక్కి చెప్పారు.

'తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో చంద్రశేఖర్ రావు ఒత్తిడిని, కష్టాలను తట్టుకున్నారు. ఢిల్లీ ఒత్తిడికి ఆయన ఎప్పుడూ తలొగ్గలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయన దృఢంగా ఉన్నారు. కేసీఆర్ అజేయుడు. మూర్ఖులు చరిత్రను అర్థం చేసుకోలేరు, చరిత్ర సృష్టించడం కూడా చేయలేరు.' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ పేరు వింటేనే వణికిపోతారని, కానీ ఆయన పేరు చెప్పేంత స్థాయి కూడా వారికి లేదన్నారు కేటీఆర్.
హరిష్ రావు కామెంట్స్
కేసీఆర్‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రికి జారీ చేసిన నోటీసులు నిజమైన దర్యాప్తులో భాగం కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతీకార దాడి అని అన్నారు. ప్రభుత్వం చౌకబారు రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించిందన్నారు. చట్టపరమైన విధానాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించారని పేర్కొ్న్నారు.
దశాబ్ద కాలం రాష్ట్రాన్ని నడిపించిన మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు. సిట్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యక్ష ఆదేశాల మేరకు పనిచేస్తుందని ఆరోపించారు.
ప్రజల అసంతృప్తి, నెరవేరని వాగ్దానాలు, మోసాల నుండి దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు, పెద్ద ఎత్తున సిబ్బందిని మోహరించడం వంటివి బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టలేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ భయం కనిపిస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నప్పటికీ.. బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని హరీష్ రావు అన్నారు. భయపడే ప్రభుత్వాలు మాత్రమే ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటాయని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే మౌనంగా ఉండమని హెచ్చరించారు.
{{/usCountry}}కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నప్పటికీ.. బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని హరీష్ రావు అన్నారు. భయపడే ప్రభుత్వాలు మాత్రమే ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటాయని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే మౌనంగా ఉండమని హెచ్చరించారు.
{{/usCountry}}