హైదరాబాద్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మిగతా కూరగాయల ధరలు ఒకింత స్థిరంగా ఉన్నప్పటికీ, చిల్లర మార్కెట్లలో నిమ్మకాయల ధరలు కిలో రూ. 220 నుండి రూ. 250 వరకు పలుకుతున్నాయి. చివరికి చికెన్ ధరతో నిమ్మకాయల ధర పోటీ పడటం గమనార్హం.

మరింత విస్తుపోయే విషయమేమిటంటే, ఆన్‌లైన్ క్విక్ కామర్స్, డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో నిమ్మకాయల ధరలు ఏకంగా కిలో రూ. 320 నుండి రూ. 340 వరకు చేరాయి. సాధారణ సూపర్ మార్కెట్లలో సైతం అధిక ధరలకే విక్రయిస్తున్నారు. ధరల మంట కారణంగా సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటేనే భయపడిపోతున్నారు.
గతంలో రూ. 20లకే దొరికే ఆరు నిమ్మకాయలకు ఇప్పుడు ఏకంగా రూ. 40 లేదా 50 వెచ్చించాల్సి వస్తోందంటున్నారు జనాలు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిస్థితి చూసుకుంటే.. ఇక్కడ రిటైల్‌లో కిలో రూ. 220 నుండి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ. 140 నుండి రూ. 150 ఉన్న ధరలు, గత 20 రోజులుగా నిరంతరం పెరిగాయి.
హోల్‌సేల్ మార్కెట్‌లో నిమ్మకాయల ధర కిలో రూ. 150 నుండి రూ. 180 వరకు ఉండగా, చిల్లర మార్కెట్‌లో రూ. 200 నుండి రూ. 250 వరకు అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన నిమ్మకాయల దిగుమతులు బాగా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లకు ప్రధానంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి రవాణా చేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, ఆ భారం వినియోగదారులపై పడుతోంది.
నిమ్మకాయల ధరలు మండిపోతున్నప్పటికీ, మిగిలిన కూరగాయల ధరలు వినియోగదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్ ప్రకారం వివిధ కూరగాయల ధరల వివరాలు చూస్తే.. చిక్కుడుకాయలు కిలో రూ. 100, దొండకాయలు కిలో రూ. 50, బీట్రూట్ కిలో రూ. 50, బెండకాయలు కిలో రూ. 40, పచ్చిమిర్చి కిలో రూ. 40, టమాటాలు కిలో రూ. 20, కీరా దోస కిలో రూ. 20 వరకు ఉన్నాయని మార్కెట్‌లో పని చేసే బండి మహేశ్ అనే వ్యక్తి తెలిపారు.
{{/usCountry}}నిమ్మకాయల ధరలు మండిపోతున్నప్పటికీ, మిగిలిన కూరగాయల ధరలు వినియోగదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్ ప్రకారం వివిధ కూరగాయల ధరల వివరాలు చూస్తే.. చిక్కుడుకాయలు కిలో రూ. 100, దొండకాయలు కిలో రూ. 50, బీట్రూట్ కిలో రూ. 50, బెండకాయలు కిలో రూ. 40, పచ్చిమిర్చి కిలో రూ. 40, టమాటాలు కిలో రూ. 20, కీరా దోస కిలో రూ. 20 వరకు ఉన్నాయని మార్కెట్‌లో పని చేసే బండి మహేశ్ అనే వ్యక్తి తెలిపారు.
{{/usCountry}}గత వారంతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, నిమ్మకాయల రేట్లు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో దిగుమతులు పెరిగితే తప్ప నిమ్మకాయల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.