...
...
Next Story

మరో నాలుగు రోజులు పొడి వాతావరణం - ఈనెల 16 నుంచి తెలంగాణలో వర్షాలు!

తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు ప్రధానంగా పొడి వాతావరణం నెలకుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 16 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Published on: Oct 12, 2026, 06:03:00 IST
Advertisement

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మళ్లీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా... మరికొన్నిరోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా ఉక్కపోతతో పాటు ఎండల తీవ్రత తగ్గే సూచనలున్నాయి.

తెలంగాణ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్
తెలంగాణ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం.... రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు.

అక్టోబర్ 16 నుంచి తేలికపాటి వర్షాలు…

ఇక అక్టోబర్ 16 ఉదయం నుండి అక్టోబర్ 18 ఉదయం వరకు వాతావరణంలో మార్పులుంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ లేవు.

గడిచిన వారం రోజులుగా ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. గాలిలో తేమ శాతం పడిపోవడంతో వేడి తీవ్రత అధికంగా పెరిగింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణపై నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks