హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అందరూ చూస్తుండగానే ఓ ముఠా వెంటాడి వేటకొడవళ్ళు, రాడ్లతో దాడి చేసి ఓ వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో, ప్రత్యక్ష సాక్షుల ఫోన్లలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన మహమ్మద్ నహీమ్, ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. అయితే కాలక్రమేణా వీరిద్దరూ నేర ప్రవృత్తికి అలవాటుపడి రౌడీషీటర్లుగా మారారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు కాగా, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు కూడా ఉన్నాయి.
ఇటీవల నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన భారీ మొత్తంలో డబ్బుల పంపిణీ విషయంలో గత మూడు నెలలుగా నహీమ్, మహేష్‌ల మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. ఈ ఆర్థిక తగాదాలు ముదిరి చివరికి ఒకరినొకరు మట్టుబెట్టుకునే స్థాయికి చేరాయి.
నహీమ్‌ను హతమార్చేందుకు పథకం పన్నిన మహేష్ గ్యాంగ్ అతని కదలికలపై నిఘా ఉంచింది. సోమవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలోని ఒక మద్యం పర్మిట్ రూమ్‌కు నహీమ్ రాగా.. ముందస్తు సమాచారంతో వచ్చిన మహేష్ తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. నహీమ్ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, వెంటాడి మరీ రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే నాగోల్ పోలీసులు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}సమాచారం అందుకున్న వెంటనే నాగోల్ పోలీసులు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు ఉమామహేశ్వర్‌తో పాటు మరొక ఐదుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాలు, ప్రయాణించిన వాహనాన్ని సీజ్ చేశారు. పాత కక్షలు, ముఠా తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిసింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.