రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి…. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సభ్యత్వంపై న్యాయస్థానం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ కీలక తీర్పును వెలువరించింది.
బీఆర్ఎస్, బీజేపీ పిటిషన్లకు ఆమోదం

గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం…. ప్రతిపక్షాల వాదనలతో ఏకీభవించి వారి పిటిషన్లను పునఃసమీక్షించి ఆమోదించింది.
దానం నాగేందర్‌పై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని, పిటిషన్లను తోసిపుచ్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. స్పీకర్ ఉత్తర్వులను పక్కన పెడుతూ ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది.
శాసనసభ సభ్యుడిగా ఉంటూనే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ గుర్తుపై లేదా అధికారికంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకే వస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుంటూ ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేపై కోర్టు ఈ స్థాయిలో కఠిన తీర్పును వెలువరించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్… సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్కడ ఏదైనా ఉపశమనం లభిస్తుందా లేక హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
న్యాయం గెలిచింది - పాడి కౌశిక్ రెడ్డి
{{/usCountry}}హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్… సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్కడ ఏదైనా ఉపశమనం లభిస్తుందా లేక హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
న్యాయం గెలిచింది - పాడి కౌశిక్ రెడ్డి
{{/usCountry}}ఈ తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాము చేసిన న్యాయం పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ మాత్రమే కాకుండా మరో 8 మంది ఎమ్మెల్యేల కేసులోనూ ఇదే తరహా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు.
మరోవైపు ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, కడియం శ్రీహరి ఉన్నారు. వీరంతా కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే వీరంతా కూడా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న దానం నాగేందర్…. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారమ్ పై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు ఎమ్మెల్యే దానంను చాలా రోజులుగా టార్గెట్ చేస్తున్నారు. దానంపై అనర్హత పిటిషన్ వేసిన వాళ్లలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాకుండా… బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు…. సంచలన తీర్పుని వెలువరించింది.