Telangana Meeseva Pahani Services : తెలంగాణలోని రైతులకు, భూ యజమానులకు ప్రభుత్వం ఊరట కలిగించే వార్త అందించింది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పహాణి జారీ సేవలను మీసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. భూ భారతి పోర్టల్ ద్వారా భూముల వివరాలు చూసుకునే వెసులుబాటు మాత్రమే ఉండటంతో, అధికారికంగా పహాణి కాపీలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం గతంలో నిలిచిపోయింది.

ఫలితంగా వ్యవసాయ భూముల కొనుగోళ్లు, బ్యాంక్ రుణాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ట్రాన్సాక్షన్స్ సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజా నిర్ణయంతో మీసేవ కేంద్రాల ద్వారానే నేరుగా పహాణి కాపీని అధికారిక సర్టిఫికెట్‌గా పొందే సదుపాయం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ మీసేవ నిర్వాహకుల ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తూ…. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
మీసేవ ద్వారా పహాణి పొందే విధానం….
ఈ సేవలు కేవలం మీసేవ కేంద్రం నిర్వాహకుల లాగిన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….
- మీసేవ కేంద్రంలో పహాణి కాపీ అప్లికేషన్ మాడ్యూల్‌ను ఎంచుకుంటారు.
- దరఖాస్తుదారుడి పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నంబరు, సర్వే నంబరు నమోదు చేయాలి.
- దరఖాస్తుదారుడి ఆధార్ నంబర్ నమోదు చేసి వేలిముద్ర (బయోమెట్రిక్ అథెంటికేషన్) వేయాల్సి ఉంటుంది.
- ఆధార్ వివరాలు సరిపోలిన తర్వాత అధికారిక పహాణి సర్టిఫికెట్ ప్రింట్ అవుతుంది.
- పహాణి ఒక్కో కాపీకి యూజర్ ఛార్జీలు రూ.80, మీసేవ ఫీజు రూ.10 చొప్పున మొత్తం రూ.90 చలాన్ అమౌంట్ అవుతుంది.

భూమికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన రెవెన్యూ రికార్డు పహాణి. ఇందులో భూ యజమాని (పట్టాదారుడి) పేరు, అనుభవిస్తున్న వారి పేరు, సర్వే నంబరు, భూమి విస్తీర్ణం, భూమి రకం, ప్రస్తుతం సాగు చేస్తున్న పంట వివరాలు స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా భూమిపై ఉన్న అప్పులు, తాకట్టు లేదా లీజు వివరాలు కూడా తెలుస్తాయి. భూముల కొనుగోలు సమయాల్లో, బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేందుకు…. అలాగే కోర్టు కేసులలో హక్కులను నిరూపించుకోవడానికి ఈ అధికారిక పహాణి సర్టిఫికెట్ కీలక పాత్ర పోషిస్తుంది.