Telangana ATC Skill Competitions : రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) కేవలం ఉద్యోగ శిక్షణకే పరిమితం కాకుండా…. యువతలోని సృజనాత్మకతను వెలికితీసే వేదికలుగా మారుతున్నాయని కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఏటీసీల్లో రెండేళ్ల శిక్షణతోనే సొంతంగా విద్యుత్ వాహనాలు తయారు చేసే స్థాయికి ఎదగడం రాష్ట్రంలోని నైపుణ్య శిక్షణ వ్యవస్థకు పక్కా నిదర్శనమని స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఏటీసీని మంగళవారం మంత్రి సందర్శించారు. అక్కడ ఏటీసీ విద్యార్థులు పార్థసారథి… స్ఫూర్తి రూపొందించిన వినూత్న విద్యుత్ వాహనాలను స్వయంగా పరిశీలించి వారిని అభినందించారు. పాత విడిభాగాలను ఉపయోగించి రూ.45 వేల వ్యయంతో స్ఫూర్తి ఎలక్ట్రిక్ కారును తయారు చేయగా, రూ.1.60 లక్షల వ్యయంతో రవాణాకు ఉపయోగపడే ఈవీని పార్థసారథి అభివృద్ధి చేశారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు సాధించిన పలువురు విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.
వచ్చే ఏడాది నుంచి స్కిల్ కాంపిటీషన్లు - మంత్రి
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ…. రాబోయే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 ఏటీసీలలో ప్రతి ఏటా ప్రతిభ పోటీలు (స్కిల్ కాంపిటీషన్లు) నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పోటీల్లో టాప్-10లో నిలిచే అత్యుత్తమ ఇన్నోవేటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా…. ఏటీసీల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఈ ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు.
టాటా సంస్థ భాగస్వామ్యంతో సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఈ ఏటీసీలను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో 100 మందికి టాటా సంస్థలోనే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
{{/usCountry}}టాటా సంస్థ భాగస్వామ్యంతో సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఈ ఏటీసీలను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో 100 మందికి టాటా సంస్థలోనే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
{{/usCountry}}విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో శిక్షణకు దూరం కాకుండా ఉండటానికి నెలకు రూ.2 వేల స్టైఫండ్, ఉచిత అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా…. టామ్‌కామ్ (TOMCOM) ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా రూ.90 కోట్లతో జర్మన్, జపనీస్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. మణుగూరులో ఐటీసీ సీఎస్‌ఆర్ నిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.