మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కీలక పరిణామం.. అమృత బాబాయ్‌కి బెయిల్!
మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

ప్రణయ్ హత్య కేసులో గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. శ్రవణ్ జీవిత ఖైదును సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. తెలంగాణ హైకోర్టు శ్రవణ్ వయసు, జైలు జీవితాన్ని దృష్టి పెట్టుకుని బెయిల్ మంజూరు చేసింది.
పెరుమాళ్ల ప్రణయ్, అమృత వర్షిణి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2018లో వివాహం చేసుకున్నారు. తన కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ను అంతం చేయడానికి కోటి రూపాయల సుపారీతో కిరాయి హంతకులను నియమించాడు.
2018 సెప్టెంబర్ నెలలో గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తుండగా.. ఆమె కళ్లముందే కిరాయి హంతకుడు ప్రణయ్ మెడపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే వ్యక్తి ప్రణయ్‌ని చంపేశాడు. ఈ కేసులో సుభాష్, మారుతీ రావు, శ్రవణ్ కుమార్‌తోపాటుగా మరికొందరు అరెస్ట్ అయ్యారు. మారుతీ రావు, సుభాష్ శర్మ బెయిల్ మీద విడుదల అయ్యారు. విచారణ దశలోనే 2020లో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులకు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది. తాజాగా అమృత బాబాయ్ శ్రవణ్‌కు బెయిల్ వచ్చింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


