...
...
Next Story

Telangana Assembly : సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Monsoon Session 2026 : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Published on: Aug 25, 2026, 06:51:49 IST
Advertisement

Telangana Assembly Monsoon Session 2026 : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఈ భేటీలో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించడంతో పాటు పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం…

తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఫొటో)
తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఫొటో)

నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. భూసేకరణ సకాలంలో పూర్తి కాకపోతే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికీ ముగియదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు నిరవధికంగా ఆలస్యమవుతాయని హెచ్చరించారు.

భూసేకరణతో పాటు నిర్వాసితుల పరిహారం, పునరావాసం, అటవీ శాఖ అనుమతులు పొందడానికి కావలసిన నిధులను ప్రభుత్వం సకాలంలో మంజూరు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చొరవ తీసుకుని ప్రాజెక్టుల పనులను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

కీలక అంశాలపై చర్చ…!

ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. ప్రధానంగా 22ఏ జాబితా భూముల విషయంపై బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పాలిటెక్నిక్ విద్యార్థుల విషయంతో పాటు గోదావరి జలాల తరలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks