వాహనదారులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ నెంబర్‌పై ఆర్టీఏ కొత్త రూల్.. రెండు నెలలే టైమ్!
వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నచ్చిన నెంబర్ కావాలనుకునేవారు 60 రోజుల్లోపు తీసుకోవాలి. లేదంటే ఆటోమేటిక్‌గా ఏదో ఒక నెంబర్ మీకు వచ్చేస్తుంది.
మీరు కొత్తగా వాహనం కొనుగోలు చేసి, దానికి నచ్చిన ఫ్యాన్సీ నంబర్ (ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్) కేటాయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. మీరు వాహనం కొని తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) పొందిన రెండు నెలల లోపు ప్రత్యేక నంబర్‌ను రిజర్వ్ చేసుకోని వాహనదారులకు రవాణా శాఖ షాక్ స్పష్టం చేసింది. ఒకవేళ మీరు టీఆర్ నెంబర్ అలాగే ఉంచి.. తిరుగుతుంటే.. రెండు నెలల్లో అలాంటి వారికి ఇకపై సిస్టమ్ ఆటోమేటిక్‌గా సాధారణ నంబర్‌ను కేటాయిస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ప్రస్తుతం అమలులో ఉన్న ‘వాహన్’ (VAHAN) విధానం ప్రకారం.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి జారీ చేసే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) కేవలం 30 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే సవరించిన తాజా విధానం ప్రకారం.. వాహన యజమానులకు టీఆర్ జారీ చేసిన తేదీ నుండి రెండు నెలల (60 రోజులు) సమయం లభిస్తుంది. ఈ లోపు వారు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా ఎలాంటి నంబర్ కేటాయించుకోకపోతే, వాహన్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఒక సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్‌ను జనరేట్ చేసి కేటాయిస్తుంది.
వాహనం కొనుగోలు చేసే సమయంలో ఫ్యాన్సీ నంబర్ పట్ల ఆసక్తి చూపి, ఇప్పటివరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే స్పందించాలని అధికారులు సూచించారు. గడువు ముగిస్తే మాత్రం కంప్యూటరైజ్డ్ పద్ధతిలో రాండమ్‌గా సాధారణ నంబర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు.
రవాణా శాఖ అధికారిక ‘వాహన్’ పోర్టల్‌ను సందర్శించి మీ పరిధిలోని సిరీస్‌లో అందుబాటులో ఉన్న ఫ్యాన్సీ నంబర్ల జాబితాను పరిశీలించండి. మీకు నచ్చిన నంబర్ కోసం నిర్ణీత రుసుము చెల్లించి ఆన్‌లైన్ వేలం (E-Auction) ప్రక్రియలో పాల్గొనండి.
టీఆర్ తీసుకున్న 60 రోజుల లోపే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా చూసుకోండి. లేదంటే సాధారణ నంబర్‌తోనే సర్దుకుపోవాల్సి వస్తుంది.
రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అలాగే ఆర్టీఏ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి కాలయాపన చేయకుండా వెంటనే మీ లక్కీ నంబర్‌ను లాక్ చేసుకోండి!
కొనుగోలు సమయంలో ఫ్యాన్సీ నంబరు పొందడానికి ఆసక్తి చూపినప్పటికీ, ఇంకా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని రవాణా శాఖ సూచించింది. రెండు నెలల గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రిజర్వేషన్ జరగకపోతే 'వాహన్' వ్యవస్థ ఆటోమేటిక్‌గా ఒక సాధారణ నంబరును రూపొందించి కేటాయిస్తుందని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


