...
...
Next Story

అటానమస్ కాలేజీల మార్కుల వ్యవహారంలో ఉస్మానియా వర్సిటీ కీలక ఆదేశాలు

అటానమస్ కాలేజీల మార్కుల వ్యవహారంలో ఉస్మానియా వర్సిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్కుల కేటాయింపులపై సీరియస్‌గా స్పందించింది.

Published on: Oct 1, 2026, 10:25:08 IST
Advertisement

ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ అటానమస్ (స్వయంప్రతిపత్తి) కళాశాలల పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కుల కేటాయింపులో వ్యత్యాసాలు, జవాబు పత్రాల మూల్యాంకనం, రీవాల్యుయేషన్ ఫలితాల్లో తీవ్ర తేడాలు వస్తున్నాయన్న ఫిర్యాదులపై ఓయూ సీరియస్‌గా స్పందించింది.

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ

ఈ నేపథ్యంలోనే పరీక్షా విధానం, మార్కుల ప్రాసెసింగ్ సిస్టమ్‌ను పూర్తి పారదర్శకంగా మార్చాలని అటానమస్ కాలేజీల యాజమాన్యాలను వీసీ ఆదేశించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీఆర్‌ఆర్‌‌సీడీఈ ఆడిటోరియంలో అటానమస్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగురం నేతృత్వంలో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. 'విద్యా సంస్థలకు అటానమస్ లభించినప్పుడు దానికి తగ్గట్టుగానే మరింత బాధ్యత, పారదర్శకత, నైతిక ప్రవర్తన ఉండాలి. మార్కుల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావుండకూడదు.' అని స్పష్టం చేశారు.

విద్యార్థుల మార్కులను ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేని రీతిలో అత్యంత సురక్షితమైన క్లౌడ్ ఆధారిత డిజిటల్ సిస్టమ్ ద్వారా మాత్రమే అప్‌లోడ్ చేయాలని ఓయూ ఆదేశించింది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కుల మధ్య వచ్చే భారీ వ్యత్యాసాలను తక్షణమే నిశితంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దాలని సూచించింది. కొన్ని కాలేజీల్లో ఫలితాల ప్రాసెసింగ్‌‌లో నమోదు అవుతున్న లోపాలను పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి విశ్లేషణాత్మకంగా వివరించారు. ప్రతి దశలోనూ సిస్టమాటిక్ చెకింగ్ ఉండాలని నొక్కిచెప్పారు.

పరీక్షలు కేవలం బట్టీ పద్ధతిని ప్రోత్సహించేలా కాకుండా, విద్యార్థుల సృజనాత్మకత, అవగాహనా శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచనలను పరీక్షించే రీతిలో క్వశ్చన్ పేపర్లు తయారు చేయాలని వీసీ కోరారు.

పాఠ్యాంశాల బోధన, కోర్సు ఫలితాల సమర్థవంతమైన మ్యాపింగ్ ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించారు. ప్రతీ కళాశాలలో క్రమం తప్పకుండా అకడమిక్ ఆడిట్ నిర్వహించి విద్యా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలిస్తారు. ఉస్మానియా వర్సిటీ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల అటానమస్ కళాశాలల విద్యార్థులకు మార్కుల కేటాయింపు, ఫలితాల ప్రకటనలో పూర్తి న్యాయం జరుగుతుందని, మూల్యాంకనంలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks