హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. కేబీఆర్ జాతీయ పార్కు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ క్షేత్రస్థాయిలో కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఉన్న ప్రధాన మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, నగరవాసులకు మేలు చేసే పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.

గతంలో కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిపాదించిన హెచ్-సిటీ పనులను జీహెచ్‌ఎంసీ అధికారికంగా రద్దు చేసింది. పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల రక్షణ, అనవసర వ్యయాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 400 కోట్లు ఆదా అవుతాయని అంచనా వేశారు.
ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఇప్పుడు అమలులో ఉన్న వన్‌వే విధానాన్ని శాశ్వతం చేశారు. ఈ వన్ వే ప్రయాణ మార్గం వల్ల పార్కు చుట్టూ సిగ్నల్ రహితంగా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
నగరంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు అత్యంత ఆధునిక సాంకేతికతతో 6 వరుసల స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. కాంక్రీట్ వంతెనలతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా పూర్తికానుంది. వచ్చే ఏడాది నాటికి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పంజాగుట్ట, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 12, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులకు ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కేబీఆర్ పార్క్ ప్రధాన జంక్షన్ వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు వీలుగా ఒక అండర్‌పాస్‌ను కూడా నిర్మించనున్నారు. కాలినడకన వెళ్లే వాకర్లకు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ అండర్‌పాస్ ఎంతగానో ఉపయోగపడనుంది.
{{/usCountry}}ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కేబీఆర్ పార్క్ ప్రధాన జంక్షన్ వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు వీలుగా ఒక అండర్‌పాస్‌ను కూడా నిర్మించనున్నారు. కాలినడకన వెళ్లే వాకర్లకు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ అండర్‌పాస్ ఎంతగానో ఉపయోగపడనుంది.
{{/usCountry}}కేబీఆర్ పార్కులోని అరుదైన చెట్లకు, జీవవైవిధ్యానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ వంతెనలు, అండర్‌పాస్‌లు రూపకల్పన చేశారు. గ్రీన్ కవర్ తగ్గకుండా, ట్రాఫిక్ సమస్య తీర్చేలా జీహెచ్‌ఎంసీ రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ నగరవాసుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
అయితే మరోవైపు హెచ్ సిటీ పనులను రద్దు చేయడంపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు స్టార్ట్ చేశారు. తవ్విన గుంతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ధనం వృథా అయిందని అంటున్నారు. అంతేకాదు కారిడార్ కోసం చెట్లు నరికారని, ఇప్పుడేమో ఆ ప్రాజెక్ట్ లేదంటున్నారని అడుగుతున్నారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.