హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగా చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్లాట్ నంబర్ పి1 (P1) వేలంలో ఊహించని ధరకు అమ్ముడై భూముల విలువలో కొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన ఈ ఈ-వేలంలో 5.25 ఎకరాల స్థలానికి ఏకంగా రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది.
ఎకరం రూ.264 కోట్లు…

మల్టీ-యూజ్ జోన్ పరిధిలోకి వచ్చే 5.25 ఎకరాల రాయదుర్గంలోని ప్లాట్ పి1 కోసం టీజీఐఐసీ మొదట ఎకరానికి రూ.175 కోట్ల ప్రాథమిక ధర (Reserve Price) నిర్ణయించింది. అయితే వేలం ప్రారంభమైన తర్వాత ప్రముఖ డెవలపర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఈ స్థలం ఎకరానికి రూ.264 కోట్ల దక్కించుకున్నారు. అంటే రిజర్వ్ ధర కంటే ఇది ఏకంగా 50.9 శాతం ఎక్కువ ప్రీమియం సాధించింది. హైదరాబాద్‌లోని వ్యూహాత్మక కారిడార్లలో భూములకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను, ఇన్వెస్టర్లలో కనిపిస్తున్న భరోసాను ఈ రికార్డు ధర ప్రతిబింబిస్తోంది.
రాయదుర్గం కారిడార్‌లో భూముల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సరిగ్గా మూడు నెలల కిందట, అంటే 2026 మే నెలలో TGIIC నిర్వహించిన వేలంలో ఇక్కడి స్థలం ఎకరానికి రూ.237 కోట్లు పలికింది. అది అప్పటికి రికార్డు కాగా…. ఇప్పుడు ఆగస్టు 2026 నాటికి ప్లాట్ పి1 వేలం ఆ పాత రికార్డును చెరిపేస్తూ ఎకరానికి రూ.264 కోట్లకు చేరింది. స్వల్ప వ్యవధిలోనే ఎకరానికి ఏకంగా రూ.27 కోట్లు పెరగడం ఐటీ కారిడార్‌పై రియల్టర్లకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న అగ్రగామి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ వేలంలో పాల్గొన్నారు. ఎంఎస్టీసీ (MSTC) ఈ-వేలం వేదిక ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగింది. ప్రముఖ అంతర్జాతీయ ఆస్తి సలహా సంస్థ జేఎల్ఎల్ (JLL) ఈ లావాదేవీకి ఎక్స్‌క్లూజివ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించి, వేలం పోటీ వాతావరణంలో సజావుగా సాగేలా చూసింది.
{{/usCountry}}దేశవ్యాప్తంగా ఉన్న అగ్రగామి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ వేలంలో పాల్గొన్నారు. ఎంఎస్టీసీ (MSTC) ఈ-వేలం వేదిక ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగింది. ప్రముఖ అంతర్జాతీయ ఆస్తి సలహా సంస్థ జేఎల్ఎల్ (JLL) ఈ లావాదేవీకి ఎక్స్‌క్లూజివ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించి, వేలం పోటీ వాతావరణంలో సజావుగా సాగేలా చూసింది.
{{/usCountry}}ఈ వేలం విజయంపై TGIIC వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక సంతోషం వ్యక్తం చేశారు. "ప్లాట్ పి1 వేలానికి లభించిన స్పందన తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్లు ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఇది కేవలం భూమికి వచ్చిన అధిక ధర మాత్రమే కాదు; పారదర్శకత, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, వాటాదారులకు విలువను సృష్టించడం అనే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సిద్ధాంతానికి లభించిన స్పష్టమైన ఆమోదం" అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఒక అంతర్జాతీయ స్థాయి వ్యాపార కేంద్రంగా మారిన వైనాన్ని ఈ పోటీ వేలం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.