...
...
Next Story

PM Modi Speech : బెంగాల్ లో గెలిచాం… తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం - ప్రధాని మోదీ

PM Modi Speech in Hyderabad : హైదరాబాద్ వేదికగా బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బెంగాల్ లో తొలిసారిగా బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Published on: May 10, 2026, 19:09:35 IST
Advertisement

PM Modi Speech in Hyderabad : ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన… ముందుగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్ వేదికగా బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు.

తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం - ప్రధాని మోదీ

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో) (PMO)
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో) (PMO)

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ…. ముందుగా తెలుగులో మట్లాడారు. 'ప్రియమైన తెలంగాణ ప్రజలారా…హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ప్రసంగం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ లో తొలిసారిగా బీజేపీ గెలిచిందన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీలో ఎన్నికల్లో అస్సోంలోనూ విజయం సాధించామని…. పుదిచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే ఎక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ పార్టీలను పక్కనపెట్టారని… మమతా బెనర్జీ నియంతృత్వాన్ని ఎదిరించారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోందన్నారు.

“తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది. తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్‌ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్‌ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు… అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ MMCగా మారిందని… MMC అంటే ముస్లిం లీగ్‌ మావోవాది అని దుయ్యబట్టారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని… తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు.

మావోయిస్టులకు అండగా కాంగ్రెస్ - మోదీ విమర్శలు

“కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయి. మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారింది.తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారు. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహితంగా మారుతోంది” అంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యుద్ధం కారణంగా ఇంధనం సంక్షోభం వచ్చిందిని ప్రధాని మోదీ వివరించారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదన్న ఆయన… పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో సేవలను వాడుకోవాలని… ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks