తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆ ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామని అసెంబ్లీలో ప్రకటించారు.

బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రూ. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకుల భూముల వివరాలను ఆయన సభ ముందుంచారు.
'కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో ఉన్న 31 గ్రామాల్లో ఏకంగా 439 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవితకు 37 ఎకరాలు, సంతోష్‌రావుకు 79 ఎకరాల చొప్పున భూములు ఉన్నాయి.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డిలు 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్‌లోని 50 ఎకరాల్లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఉందని, పైలట్ రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని వివరించారు.
రాష్ట్రంలో జరిగిన భారీ భూ కుంభకోణాల గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని(SET) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు బయటపెట్టింది ధరణి పార్ట్-1 మాత్రమేనని, త్వరలోనే పార్ట్-2 అక్రమాలను కూడా శాసనసభ వేదికగానే బట్టబయలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు తన కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం లేకే సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారానికి హైపవర్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో సమగ్ర మార్గదర్శకాలు (గైడ్‌లైన్స్) విడుదల చేసి, హెచ్ఎండీఏ (HMDA), జీహెచ్ఎంసీ (GHMC), డీటీసీపీ (DTCP) లేఔట్ల దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు.
{{/usCountry}}22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారానికి హైపవర్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో సమగ్ర మార్గదర్శకాలు (గైడ్‌లైన్స్) విడుదల చేసి, హెచ్ఎండీఏ (HMDA), జీహెచ్ఎంసీ (GHMC), డీటీసీపీ (DTCP) లేఔట్ల దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు.
{{/usCountry}}ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జీఓ 118 కింద ఉన్న 9,500 మంది బాధితులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా అక్కడ పెండింగ్‌లో ఉన్న స్థలాలను క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రవర్తనను సీఎం తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన సభా నిబంధనల ప్రకారమే ప్లకార్డులు, నినాదాల ఫ్లెక్సీలతో రావడాన్ని స్పీకర్ నిషేధించారని, ఆ ఆదేశాలనే పోలీసులు అమలు చేస్తున్నారని వివరించారు. చట్టబద్ధంగా చర్చకు సిద్ధమై పేదలకు మేలు జరిగేలా విపక్షాలు సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.