...
...
Next Story

వరంగల్, విజయవాడ మీదుగా బెంగళూరు - ఈ డైలీ ఎక్స్​ప్రెస్ ట్రైన్ ఇక రెగ్యులర్! టైమింగ్స్ ఇలా

వరంగల్, విజయవాడ మీదుగా నడిచే దానాపూర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేస్తూ కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రతిరోజు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Published on: Aug 28, 2026, 10:55:23 IST
Advertisement

Danapur SMVT Bengaluru Daily Express : తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ప్యాసింజర్లకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రయాణికుల తీవ్ర రద్దీ, డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దానాపూర్ – SMVT బెంగళూరు – దానాపూర్ (రైలు నంబర్లు 22365 / 22366) మధ్య నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును క్రమబద్ధీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు మరింత మెరుగైన రైలు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • రైలు నంబర్ 22365 (దానాపూర్ – బెంగళూరు) : 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుండి దానాపూర్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ రెగ్యులర్ సర్వీసుగా బయలుదేరుతుంది.
  • రైలు నంబర్ 22366 (SMVT బెంగళూరు – దానాపూర్) : 2026 సెప్టెంబర్ 3వ తేదీ నుండి SMVT బెంగళూరు నుండి ప్రతిరోజూ దానాపూర్ వైపునకు తన రెగ్యులర్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు ఇక రెగ్యూలర్
దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు ఇక రెగ్యూలర్

ఈ డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

దానాపూర్ నుంచి SMVT బెంగళూరు… టైమింగ్స్

ఈ రైలు దానాపూర్‌లో మధ్యాహ్నం 14:45 గంటలకు బయలుదేరి, ఆరా వద్ద 15:16/15:18 గంటలకు ఆగుతుంది. మరుసటి రోజు సాయంత్రం 19:00/19:02 గంటలకు తెలంగాణలోని వరంగల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత రాత్రి 23:35/23:45 గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. రెండవ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 01:28/01:30 గంటలకు ఒంగోలు, ఉదయం 04:53/04:55 గంటలకు గూడూరు చేరుకుంటుంది. అనంతరం కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్ స్టేషన్‌కు మధ్యాహ్నం 13:20/13:22 గంటలకు చేరుకుని, చివరికి మధ్యాహ్నం 14:30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

బెంగళూరు నుంచి దానాపూర్ … టైమింగ్స్

తిరుగు ప్రయాణంలో ఈ రైలు బెంగళూరులో రాత్రి 23:50 గంటలకు బయలుదేరి, అర్ధరాత్రి 00:13/00:15 గంటలకు వైట్‌ఫీల్డ్ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 09:53/09:55 గంటలకు గూడూరు, మధ్యాహ్నం 11:58/12:00 గంటలకు ఒంగోలు, మధ్యాహ్నం 14:55/15:05 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 18:18/18:20 గంటలకు వరంగల్ చేరుకుని, రాత్రి 23:01/23:03 గంటలకు ఆరా మీదుగా ప్రయాణించి, చివరికి అర్ధరాత్రి 00:15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe