...
...
Next Story

SCR Special Trains : రైలు ప్రయాణికులకు శుభవార్త... సికింద్రాబాద్ - కాగజ్‌నగర్ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు

SCR Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రెండు జనసాధారణ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Published on: Sep 4, 2026, 10:12:29 IST
Advertisement

సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు జనసాధారణ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు 2026 సెప్టెంబర్ 4న అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

రైళ్ల సమయాలు, మార్గాల వివరాలు:

  • రైలు నంబర్ 07235 (సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్): ఈ రైలు సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 (5:30) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07236 (సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబర్ 4 సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలుదేరి, రాత్రి 23:15 (11:15) గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

స్టాపేజీల వివరాలు:

రైల్వే ప్రయాణికులకు అలర్ట్
రైల్వే ప్రయాణికులకు అలర్ట్

ఈ రెండు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఈ రైళ్లలోని అన్ని భోగీలు అన్‌రిజర్వ్‌డ్ (సాధారణ) కోచ్‌లేనని, ప్రయాణికులు జనరల్ టికెట్లతో నేరుగా ప్రయాణించవచ్చని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe