ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కానుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

ఈరోజు డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా హౌసింగ్ శాఖ 99 రోజుల్లో చేపట్టవలసిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం రాష్ట్ర చరిత్రలో ఒక బెంచ్ మార్క్‌గా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.
బ్రిక్ యూనిట్లు ఏర్పాటు చేయండి - మంత్రి పొంగులేటి
“ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు, ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామాగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలి” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాక ఒకటి లేదా రెండు విడతల్లో చెల్లింపులు జరిగిన తరువాత… వివిధ కారణాలతో చెల్లింపులు ఆగిపోతే వెంటనే క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. తక్షణమే క్లియర్ చేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రెండో దశలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
ఏ సంక్షేమ పథకం విజయవంతం కావాలంటే ముఖ్యమంత్రి, మంత్రి, కార్యదర్శి మాత్రమే ప్రయత్నించడం సరిపోదని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సంబంధిత శాఖలోని ప్రతి అధికారి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేసినప్పుడే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}ఏ సంక్షేమ పథకం విజయవంతం కావాలంటే ముఖ్యమంత్రి, మంత్రి, కార్యదర్శి మాత్రమే ప్రయత్నించడం సరిపోదని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సంబంధిత శాఖలోని ప్రతి అధికారి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేసినప్పుడే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}