SCR Holi Special Trains : హోలీ పండగ స్పెషల్ - ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు..! రూట్ల వారీగా వివరాలు

హోలీ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–దానాపూర్‌, యశ్వంత్‌పూర్‌, బరంపూర్ మధ్య ఈ రైళ్లను నడపనుంది.

Published on: Feb 21, 2026, 13:07:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హోలీ పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.చర్లపల్లి–దానాపూర్‌, యశ్వంత్‌పూర్‌–హజరత్‌ నిజాముద్దీన్‌ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

హోలీ ప్రత్యేక రైళ్లు
హోలీ ప్రత్యేక రైళ్లు

ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు…

  • దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం…. ఈ నెల 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో చర్లపల్లి– దానాపూర్‌ (07091) మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి. మధ్యాహ్నం చర్లపల్లి నుంచి బయల్దేరి…మరునాడు రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకుంటాయి.
  • ఈ నెల 25, మార్చి 1, 5, 9న దానాపూర్‌–చర్లపల్లి (07092) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్ తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు దానాపూర్ నుంచి బయల్దేరి… మరునాడు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి.
  • ఫిబ్రవరి 28వ తేదీన చర్లపల్లి–దానాపూర్‌ (07093) మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మార్చి 2వ తేదీన దానాపూర్‌–చర్లపల్లి(07094) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, మార్చి 1న చర్లపల్లి–దానాపూర్‌ (07095) మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి.
  • చర్లపల్లి నుంచి బ్రహ్మపూర్(07027) మధ్య మార్చి 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 9.30 గంటలకు బరంపూర్ కు చేరుకుంటాయి.
  • ఇక బ్రహ్మపూర్ నుంచి చర్లపల్లి(07028) మధ్య మార్చి 7,14, 21, 28 తేదీల్లో ఉదయం 11.30 గంటలకు బ్రహ్మపూర్ నుంచి బయలేరుతాయి. ఈ ప్రత్యేక రైళ్లు మరునాడు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, ఇచ్చాపురం వంటి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.
  • ఫిబ్రవరి 25వ తేదీన యశ్వంత్‌పూర్‌– హజరత్‌ నిజాముద్దిన్‌ (ట్రైన్ నెంబర్ 06569) స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇక మార్చి మార్చి 1వ తేదీన హజరత్‌నిజాముద్దిన్‌– యశ్వంత్‌పూర్‌ (06570) మధ్య మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు యలహంక, ధర్మవరం, అనంతపురం, ధోన్, కర్నూలు నగరం, కాచిగూడ, కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, బినా, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర జంక్షన్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More