South Central Railway Special Trains : వచ్చే దసరా, దీపావళి మరియు ఛట్ పూజ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ అందించింది. వివిధ ప్రాంతాలకు నడిచే పలు వారపు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొత్తం 98 సర్వీసులను నవంబర్ 2026 చివరి వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

{{^htLoading}} {{/htLoading}}
ఈ నిర్ణయంతో పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లేవారికి… ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునే వారికి సీట్ల కొరత నుంచి ఉపశమనం లభించనుంది. పొడిగించిన రైళ్లు, నడిచే రోజులు, సర్వీసుల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు:
- సికింద్రాబాద్ - నహర్లాగన్ (ట్రైన్ నం. 07046) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలును అక్టోబర్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు (5 సర్వీసులు) పొడిగించారు.
- నహర్లాగన్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 07047 ): ప్రతి సోమవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 2, 2026 వరకు (5 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- హైదరాబాద్ - కొల్లాం (ట్రైన్ నం. 07193) : ప్రతి శనివారం నడిచే ఈ రైలును అక్టోబర్ 3, 2026 నుంచి నవంబర్ 28, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంచారు.
- కొల్లాం - హైదరాబాద్ (ట్రైన్ నం. 07194) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
- సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (ట్రైన్ నం. 07425) : ప్రతి ఆదివారం నడిచే ఈ సర్వీసును అక్టోబర్ 4, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు (9 సర్వీసులు) పొడిగించారు.
- శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 07426) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
- చర్లపల్లి - తిరువణ్ణామలై(అరుణాచలం) (ట్రైన్ నం. 07001) : ప్రతి గురువారం నడిచే ఈ రైలు అక్టోబర్ 1, 2026 నుంచి నవంబర్ 26, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- తిరువణ్ణామలై - చర్లపల్లి (ట్రైన్ నం. 07002) : ప్రతి శుక్రవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
- జాల్నా - తిరుపతి (ట్రైన్ నం. 07814) : ప్రతి గురువారం నడిచే ఈ రైలు అక్టోబర్ 1, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
- తిరుపతి - జాల్నా (ట్రైన్ నం. 07815) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
- హెచ్.ఎస్. నాందేడ్ - తిరుచానూరు (ట్రైన్ నం. 07603): ప్రతి మంగళవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 24, 2026 వరకు (8 సర్వీసులు) పొడిగించారు.
- తిరుచానూరు - హెచ్.ఎస్. నాందేడ్ (ట్రైన్ నం. 07604) : ప్రతి బుధవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 7, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు (8 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}