South Central Railway Special Trains : క్రిస్మస్, సంక్రాంతి పండుగల సెలవుల్లో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు వివిధ గమ్యస్థానాల మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి స్టేషన్ల నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
పొడిగించిన రైళ్ల వివరాలు…
- సికింద్రాబాద్ - నహర్లగన్ ప్రత్యేక రైళ్లు - నంబర్ 07046 : డిసెంబర్ 4, 2026 నుంచి డిసెంబర్ 25, 2026 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది (మొత్తం 4 సర్వీసులు).
- నహర్లగన్ – సికింద్రాబాద్ -రైలు నంబర్ 07047 : డిసెంబర్ 7, 2026 నుంచి డిసెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).
- హైదరాబాద్ - దానాపూర్ (రైలు నంబర్ 07091) ప్రత్యేక రైళ్లు : డిసెంబర్ 5, 2026 నుంచి డిసెంబర్ 12, 2026 వరకు ప్రతి శనివారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
- దానాపూర్ – హైదరాబాద్ (రైలు నంబర్ 07092 ) : డిసెంబర్ 7, 2026 నుంచి డిసెంబర్ 14, 2026 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు సేవలందిస్తుంది.
- చర్లపల్లి - ససారం (రైలు నంబర్ 07041) ప్రత్యేక రైళ్లు : డిసెంబర్ 3, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు ప్రతి గురువారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
- ససారం – చర్లపల్లి(రైలు నంబర్ 07042 : డిసెంబర్ 4, 2026 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
- మహారాష్ట్ర - తిరుపతి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు : జనవరి 7, 2027 నుంచి జనవరి 14, 2027 వరకు ప్రతి గురువారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
- తిరుపతి – జల్నా : జనవరి 8, 2027 నుంచి జనవరి 15, 2027 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది (మొత్తం 2 సర్వీసులు).
- చర్లపల్లి - ప్రతాప్ నగర్ (గుజరాత్) ప్రత్యేక రైళ్లు : డిసెంబర్ 5, 2026 నుంచి డిసెంబర్ 26, 2026 వరకు ప్రతి శనివారం నడుస్తుంది (మొత్తం 4 సర్వీసులు).
- ప్రతాప్ నగర్ – చర్లపల్లి(రైలు నంబర్ 07088 ): డిసెంబర్ 6, 2026 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 4 సర్వీసులుంటాయి.

పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల తాజా షెడ్యూల్, సమయాలను ముందుగానే సరిచూసుకుని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.