SCR Sankranti Special Trains 2027 : రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ఆరు వారపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

{{^htLoading}} {{/htLoading}}
సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి - కాకినాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మొదటి వారం వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పండుగ వేళ టికెట్లు దొరక్క ఇబ్బంది పడే ప్రయాణికులు ఈ పొడిగించిన తేదీలను గమనించి ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్లు (9 సర్వీసులు) :
- రైలు నెం. 07425 (సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్) : ప్రతి ఆదివారం నడిచే ఈ రైలును డిసెంబర్ 6, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు పొడిగించారు.
- రైలు నెం. 07426 (శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 7, 2026 నుంచి ఫిబ్రవరి 1, 2027 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఒక్కొక్కటి 9 ట్రిప్పుల చొప్పున నడుస్తాయి.
చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (9 సర్వీసులు) :
- రైలు నెం. 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్) : ప్రతి మంగళవారం నడిచే ఈ రైలు సర్వీసులను డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 26, 2027 వరకు పొడిగించారు.
- రైలు నెం. 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి) : ప్రతి బుధవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 2, 2026 నుంచి జనవరి 27, 2027 వరకు రాకపోకలు సాగిస్తుంది. ఇవి కూడా 9 సర్వీసుల చొప్పున నడుస్తాయి.
చర్లపల్లి – కాకినాడ – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (9 సర్వీసులు) :
- రైలు నెం. 07039 (చర్లపల్లి - కాకినాడ) : ప్రతి గురువారం నడిచే ఈ ప్రత్యేక రైలును డిసెంబర్ 3, 2026 నుంచి జనవరి 28, 2027 వరకు పొడిగించారు.
- రైలు నెం. 07040 (కాకినాడ - చర్లపల్లి) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 4, 2026 నుంచి జనవరి 29, 2027 వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ మార్గంలోనూ 9 సర్వీసుల చొప్పున నడపనున్నారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}