...
...
Next Story

సికింద్రాబాద్‌ - కాగజ్‌నగర్‌ రూట్ లో 34 పండుగ స్పెషల్‌ రైళ్లు... యాదాద్రి స్టేషన్ లోనూ స్టాపేజీ!

దసరా, బతుకమ్మ, నవరాత్రి పండుగల వేళ దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ స్పెషల్ రైళ్లకు యాదాద్రిలో అదనపు స్టాపేజ్ కేటాయించింది.

Published on: Oct 10, 2026, 14:39:34 IST
Advertisement

దసరా, బతుకమ్మ, నవరాత్రి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే పండుగ ప్రత్యేక రైళ్లకు యాదాద్రి (యాదగిరిగుట్ట) రైల్వే స్టేషన్‌లో అదనపు స్టాపేజ్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

పండుగ స్పెషల్‌ రైళ్లు - యాదాద్రికి స్టాపేజీ
పండుగ స్పెషల్‌ రైళ్లు - యాదాద్రికి స్టాపేజీ

పండుగ రోజుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, సొంత ఊళ్లకు ప్రయాణమయ్యే వేలాది మంది ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు ప్రయోగాత్మక స్టాపేజ్ సౌకర్యం అక్టోబర్ 25, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

34 డైలీ సర్వీసులు…

పండుగ రద్దీని తట్టుకునేందుకు సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ మార్గంలో మొత్తం 34 డైలీ ఫెస్టివల్ స్పెషల్ సర్వీసులను రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. వీటిలో రైలు నంబర్ 07711 మరియు 07712 సర్వీసులు ఉన్నాయి.

  • రైలు నంబర్ 07711 (సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్) : ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి చర్లపల్లి (12:30/12:32), భోంగీర్ (12:59/13:00) మీదుగా మధ్యాహ్నం 13:09 గంటలకు యాదాద్రి చేరుకుంటుంది. అక్కడ ఒక నిమిషం పాటు ఆగిన తర్వాత 13:10 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ మీదుగా సాయంత్రం 17:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07712 (సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సాయంత్రం 18:00 గంటలకు బయలుదేరి రాత్రి 21:39 గంటలకు యాదాద్రి స్టేషన్‌కు చేరుకుంటుంది. 21:40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భువనగిరి, చర్లపల్లి, సికింద్రాబాద్ మీదుగా రాత్రి 23:15 గంటలకు హైదరాబాద్ నాంపల్లి చేరుకుంటుంది. అక్టోబర్ 9 నుంచి 25 వరకు ప్రతిరోజూ నడిచే ఈ 17 జతల (మొత్తం 34) ప్రత్యేక రైళ్ల సర్వీసులను ప్రయాణికులు, ఆధ్యాత్మిక భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks