SCR Holi Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మీదుగా ‘హోలీ’ ప్రత్యేక రైళ్లు, తేదీలివిగో

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. హోళీ పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య వీటిని నడపనున్నట్లు పేర్కొంది.

Published on: Feb 14, 2026, 17:08:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్లనన్నాయి.

ప్రత్యేక రైలు
ప్రత్యేక రైలు

చర్లపల్లి - షాలిమార్ ప్రత్యేక రైళ్లు…

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... చర్లపల్లి - షాలిమార్ (ట్రైన్ నెంబర్ 07512) మధ్య ఫిబ్రవరి 26, మార్చి 1, మార్చి 5వ తేదీలో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 05. 40 గంటలకు చర్లప్లలి నుంచి ప్రారంభమై... మరునాడు ఉదయం 11.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

ఇక షాలిమార్ - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 07513) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఫిబ్రవరి 27, మార్చి 2, మార్చి 6 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ షాలిమార్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 09.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు…

ఈ 6 ప్రత్యేక రైళ్లు... నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు,అకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామల్ కోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలసం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపూర్ తో పాటు సంత్రగాచి స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీప్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More