మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
Sankranti Special Trains 2027 : తెలుగు ప్రయాణికులకు శుభవార్త - 30 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటన, హాల్ట్ లిస్ట్ ఇదే
SCR Sankranti special trains 2027 : సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి నర్సాపూర్, శ్రీకాకుళం రోడ్, పార్వతీపురం మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి.
SCR Sankranti special trains 2027 : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే రైళ్లన్నీ నెలల ముందే నిండిపోతాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. 2027 సంక్రాంతి పండుగ సీజన్లో అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు వివిధ ప్రాంతాల మధ్య మొత్తం 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది.

సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి నర్సాపూర్, శ్రీకాకుళం రోడ్, పార్వతీపురం గమ్యస్థానాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి….
సికింద్రాబాద్ – పార్వతీపురం ప్రత్యేక రైళ్లు (12 సర్వీసులు) :
- సికింద్రాబాద్ – పార్వతీపురం(రైలు నంబర్ 07009 ) : డిసెంబర్ 23, 30 (2026), జనవరి 6, 13, 20, 27 (2027) తేదీల్లో ప్రతి బుధవారం రాత్రి 07:30 గంటలకు (19:30) సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 01:15 గంటలకు (13:15) పార్వతీపురం చేరుకుంటుంది.
- పార్వతీపురం – సికింద్రాబాద్ (రైలు నంబర్ 07010) : డిసెంబర్ 24, 31 (2026), జనవరి 7, 14, 21, 28 (2027) తేదీల్లో ప్రతి గురువారం మధ్యాహ్నం 03:30 గంటలకు (15:30) బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో ఆగుతాయి.
చర్లపల్లి – నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు (8 సర్వీసులు) :
- చర్లపల్లి – నర్సాపూర్ (రైలు నంబర్ 07013): 2027 జనవరి 10, 12, 17, 19 తేదీల్లో (ఆది, మంగళవారాల్లో) రాత్రి 07:40 గంటలకు (19:40) చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:00 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
- నర్సాపూర్ – చర్లపల్లి (రైలు నంబర్ 07014) : 2027 జనవరి 11, 13, 18, 20 తేదీల్లో (సోమ, బుధవారాల్లో) రాత్రి 10:00 గంటలకు (22:00) బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 07:50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
- నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్లు (6 సర్వీసులు) :
- చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ (రైలు నంబర్ 07115 ): 2027 జనవరి 7, 9, 16 తేదీల్లో (గురు, శనివారాల్లో) రాత్రి 07:40 గంటలకు (19:40) బయలుదేరి…. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
- శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి(రైలు నంబర్ 07116 ) : 2027 జనవరి 8, 10, 17 తేదీల్లో (శుక్ర, ఆదివారాల్లో) మధ్యాహ్నం 02:30 గంటలకు (14:30) బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 08:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
- నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
హైదరాబాద్ – నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు (4 సర్వీసులు) :
- హైదరాబాద్ – నర్సాపూర్(రైలు నంబర్ 07117) : 2027 జనవరి 9, 16 తేదీల్లో (శనివారాల్లో) సాయంత్రం 06:40 గంటలకు (18:40) హైదరాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 07:00 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
- నర్సాపూర్ – హైదరాబాద్ (రైలు నంబర్ 07118) : 2027 జనవరి 10, 17 తేదీల్లో (ఆదివారాల్లో) రాత్రి 08:00 గంటలకు (20:00) బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 08:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
- సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
ఈ 30 ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా ప్రయాణించాలని సూచించింది.

E-Paper
