...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్... ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు! తేదీలు, రూట్లు ఇవే

దసరా, దీపావళి పూజా పండుగల రద్దీని తగ్గించేందుకు వీలుగు దక్షిణ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పోదనూర్-బరౌని మధ్య ప్రత్యేక రైళ్లను (06139/06140) ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Published on: Oct 14, 2026, 09:13:38 IST
Advertisement

వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే దసరా, దీపావళి పూజా పండుగల సందర్భంగా పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లను (ట్రెయిన్స్ ఆన్ డిమాండ్) నడుపుతున్నట్లు ప్రకటించింది.

పండగల రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు
పండగల రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు

తమిళనాడులోని పోదనూర్ జంక్షన్ నుంచి బీహార్‌లోని బరౌని మధ్య ప్రత్యేక రైళ్లు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులకు సంబంధించి అక్టోబర్ 14న ఉదయం 8.00 గంటల నుంచే దక్షిణ రైల్వే పరిధిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పండుగ సమయంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్, యాప్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ట్రైన్ టైమింగ్స్ - వివరాలు

  • రైలు నంబర్ 06139 (పోదనూర్ - బరౌని ఎక్స్‌ప్రెస్ స్పెషల్): అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం ఉదయం 06.15 గంటలకు పోదనూర్ వద్ద బయలుదేరుతుంది. ఇది మూడో రోజు (ఆదివారం) మధ్యాహ్నం 13.30 గంటలకు బరౌని చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 06140 (బరౌని - పోదనూర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్) : అక్టోబర్ 19వ తేదీ సోమవారం ఉదయం 09.30 గంటలకు బరౌనిలో బయలుదేరుతుంది. ఇది మూడో రోజు (బుధవారం) సాయంత్రం 18.30 గంటలకు పోదనూర్ చేరుకుంటుంది.

ఈ రెండు మార్గాల్లోనూ చెరొక సర్వీసును మాత్రమే దక్షిణ రైల్వే నిర్వహిస్తోంది. అయితే ఈ రైళ్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఉపయోగపడేలా ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని గూడూరు (15.48/16.50), నెల్లూరు (17.28/17.30), ఒంగోలు (18.58/19.00), విజయవాడ జంక్షన్ (21.15/21.25) స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ఇక తెలంగాణ పరిధిలోని ఖమ్మం (23.38/23.40), వరంగల్ (01.08/01.10), సిర్పూర్ కాగజ్‌నగర్ (03.58/04.00) స్టేషన్లలో స్టాపేజీలు కేటాయించారు. వీటితో పాటు ఈరోడ్, సేలం, కాట్పాడి, పేరంబూర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, పాట్లీపుత్ర మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

ఈ ప్రత్యేక రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 20 బోగీలను ఏర్పాటు చేశారు. అందులో 18 చైర్ కార్ కోచ్‌లతో పాటు, ఒక సెకండ్ క్లాస్ దివ్యాంగజన్ ఫ్రెండ్లీ కోచ్, ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks